ఇండస్ట్రీకి తలవొగ్గని భీమ్లా నాయక్ !
ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ మూవీ పట్ల క్రేజ్ ఏర్పడటంతో పాటు ఆమూవీ పాటలు బాగా హిట్ కావడంతో ఈమూవీ సంక్రాంతి రేస్ లో నిలబడితే ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ సినిమాలు రెండింటికి ఎంతోకొంత నష్టం చేకూరుతుందని చాలామంది భయపడుతున్నట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ కు మెగా క్యాంప్ ఎన్టీఆర్ క్యాంప్ మద్దతుతో పాటు ఈమూవీ నైజాం రైట్స్ ను 70 కోట్లకు కొన్ని దిల్ రాజ్ వర్గం కూడ ‘భీమ్లా నాయక్’ ను ఏదోవిధంగా వెనక్కు పంపాలని చాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ దృష్టి వరకు రావడంతో ఈమూవీ నిర్మాతలను పిలిపించి ‘భీమ్లా నాయక్’ పై నమ్మకం లేకపోతే తన మూవీని ఓటీటీ కి ఇచ్చేసుకోమని కొంతవరకు అసహనంతో చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ వెనక్కు వెళితే ఆ డేట్ కు ‘బంగార్రాజు’ ను రంగంలోకి దింపాలని నాగార్జున ఆలోచనలు చేస్తున్నట్లు వార్హ్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ వెనక్కు వెళితే తన సినిమా జూనియర్ చరణ్ ప్రభాస్ లకు భయపడి వెనక్కువెళ్ళినట్లు తప్పుడు సంకేతాలు వస్తాయి కదా అంటూ పవన్ అభిప్రాయపడుతున్నట్లు టాక్. ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు ఏదోవిధంగా ఒప్పించి టిక్కెట్ల రెట్లు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేస్ కు రాబోతోంది అని తెలిస్తే ఆంధ్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను టిక్కెట్ల రేట్ల పెంపుకు అంగీకరించదు అన్నభయాలు కూడ సంక్రాంతి రేస్ సినిమాల నిర్మాతలకు బయ్యర్లకు ఉన్నట్లు టాక్..