ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
రామ్ చరణ్ తన తదుపరి
సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరో గా తెరకెక్కిన
జెర్సీ సినిమాతో దర్శకుడి గా మంచి పేరు సంపాదించుకున్నాడు, ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ లో
జెర్సీ సినిమాను
షాహిద్ కపూర్ తో
రీమేక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రామ్ చరణ్ ,
గౌతమ్ తిన్ననూరి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు
గౌతమ్ తిన్ననూరి ,
రామ్ చరణ్ హీరో గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్
సినిమా ను తెరకెక్కించబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.