షాకింగ్ : బాడీలో ఆ పార్ట్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్న మోడల్?

praveen
ఇన్సూరెన్స్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది.  ఇటీవల కాలంలో మనిషి జీవితం లో ఇన్సూరెన్స్ కూడా ఒక భాగంగా మారి పోయింది.  మనకు కావాల్సిన ఎంతో విలువైన  వస్తువుల పై ఇన్సూరెన్స్ చేయించు కోవడం నేటి రోజుల్లో కామన్ గా మారి పోయింది. అంతే కాదు ఎంత మంది లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా తీసుకుంటున్నారు. అయితే చాలా మటుకు ఇల్లు,కారు, వాహనాలు లాంటి వాటిపై బీమా చేయడమే కాదు ఇక ప్రమాదాలపై కూడా బీమా చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. ఏదైనా నష్టం జరిగినప్పుడు భీమా ద్వారా డబ్బులు క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాని కొంత మంది సెలబ్రిటీలు మాత్రం శరీర భాగాలపై ఇన్సూరెన్స్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా శరీరం లోని భాగాల పై ఇన్సూరెన్స్ చేరుకోగా.. ఇక ఇప్పుడు ఆ లిస్టు లో చేరింది బ్రెజిల్కు చెందిన మోడల్. తన బాడీలో ఒక పార్ట్ కోసం ఏకంగా 13 కోట్ల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకుంది. వామ్మో అన్ని కోట్లతో ఇన్సూరెన్స్ చేయించుకుందా.. ఇంతకీ ఆ పార్టీ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఆ మోడల్ తన పిరుదులను ఇన్సూరెన్స్ చేయించు  కోవడం గమనార్హం. బ్రెజిల్కు చెందిన మోడల్ నాధి కిహారకు  తన పిదురుల వలన ఎంతగానో ఫేమస్ అయింది.



 మిస్ బూమ్ బూమ్ 2021 వరల్డ్ టైటిల్ను కూడా గెలుచుకుంది ఈ మోడల్. అందుకే ఇక తన పిదురులను ఏకంగా 13 కోట్ల రూపాయలు పెట్టి బీమా చేయించుకుంది   ఈ విషయం పై మాట్లాడుతూ నా పిదురులు పూర్తిగా సహజమైనవి శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా శిక్షణ పొందుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మోడల్ ఇలా పిరుదులపై ఇన్సూరెన్స్ చేసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: