ఓంకార్ సక్సెస్ వెనుక ఇంత కథ ఉందా..?
తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు.. ఒక నటుడుగా, డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని తెలియజేశాడు ఓంకార్. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల యాంకర్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. వీరి సొంత ఊరు కాకినాడ. ఇక ఈయన తండ్రి ఒక డాక్టరు. తన తండ్రి మంచితనంతో ఎంతో మందికి అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం చేయడం వల్ల, ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించలేక పోయామని చెప్పుకొచ్చాడు ఓంకార్.
ఇక ఓంకార్ ఆదిత్య మ్యూజిక్ లో వర్క్ చేస్తున్న సమయంలో తనకు జీ సంస్థ పిలిచి అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు ఓంకార్. తనకు చిన్న వయసు నుంచే విటలాచార్య సినిమాలు అంటే తెగ ఇష్టం అని తెలియజేశాడు. సాధారణ మనుషులను తీసుకువచ్చి వారితో కలసి షో చేయాలని ఉద్దేశంతోనే మాయాద్వీపం అనే ప్రోగ్రామ్ ను మొదలుపెట్టామని చెప్పుకొచ్చాడు.ఈ షో తో తన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాత ఆట ప్రోగ్రామ్ తనని హై స్థాయికి తీసుకెళ్లింది అని తెలియజేశారు ఓంకార్.
ఇక 8 ఏళ్ల తర్వాత, మాయాద్వీపంతో మళ్లీ ప్రేక్షకులకు కనిపించానని తెలియజేశాడు. పిల్లలతో మాట్లాడే మాటలు, వారి నవ్వులు తన బాధను మైమరిపిస్తాయి అని తెలియజేశాడు. ఇక తన తండ్రి చేసిన మంచి ఫలితమే తనకు సక్సెస్ అవ్వడానికి కారణం అని చెప్పుకొచ్చాడు ఓంకార్. తనని ఎవరైనా ఇమిటేట్ చేయడం చాలా ఆనందంగా ఉంటుందని తెలియజేశాడు ఓంకార్.