షాకింగ్ కాంబినేష‌న్‌: బాల‌య్య‌తో ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

VUYYURU SUBHASH
తెలుగు సినిమా రంగంలో ప్ర‌స్తుతం రాజ‌మౌళి త‌ర్వాత అంత‌టి క్రేజ్ కొర‌టాల శివ‌కే ఉంది. కొర‌టా ల కూడా నూటికి నూరు శాతం స‌క్సెస్ ల తో ఉన్నాడు. కొర‌టాల తీసిన అన్ని సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. శ్రీమంతుడు - భ‌ర‌త్ అనే నేను - జ‌న‌తా గ్యారేజ్ - మిర్చి అన్ని సినిమాలు కూడా ఇండ‌స్ట్రీ హిట్ లే కొట్టాయి. దీంతో ఇప్పుడు కొర‌టాల తీస్తోన్న ఆచార్య పై అదిరిపోయే రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఇక కొర‌టా ల ఆచార్య త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ త‌ర్వాత కొర‌టాల లైన్లో అల్లు అర్జు న్ తో పాట మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తో కూడా ఓ సినిమా చేసేందుకు కొర‌టాల ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి కే కొర‌టా ఇండ‌స్ట్రీ టాప్ హీరోలు అయిన మ‌హేష్‌బాబు - ఎన్టీఆర్ - ప్రభాస్‌తో సినిమాలు చేసేశాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా సినిమా కంప్లీట్ చేశా డు.

ఈ క్ర‌మంలోనే కొర‌టాల లైన‌ప్ లో బాల‌య్య ఉన్నాడ‌ని తెలుస్తోంది. బాల‌య్య తో ఓ సినిమా చేసేందుకు కొర‌టాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడ‌ట‌. కొర‌టాల ద‌గ్గ‌ర ఉన్న ఓ క‌థ అయితే బాల‌య్య‌కు మాత్ర‌మే సెట్ అవుతుంద‌ట‌. కొర‌టాల అడిగితే బాల‌య్య ఖ‌చ్చితంగా నో చెప్ప‌డ‌నే అంటున్నారు. కొర‌టాల క‌థ లు కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్ గానే ఉంటాయి.

ఎన్టీఆర్ సినిమా పూర్త‌య్యాక కొర‌టాల ఎప్పుడు అయినా బాల‌య్య తో సినిమా చేస్తాడ‌నే అంటున్నారు. ఇటీవ‌ల ఓ అగ్ర నిర్మాత కొర‌టాల‌ను క‌లిసి నాకు ఓ సినిమా చేయాల‌ని అడిగిన‌ప్పుడు.. కొర‌టాల బాల‌య్య క‌థ‌ను ప్ర‌స్తావించార‌ట‌. మ‌రి వీరి కాంబోలో సినిమా వ‌స్తే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: