అఖండ కష్టాలకు మార్గాల అన్వేషణ !

Seetha Sailaja
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ’ ప్రమోషన్ ప్రారంభం అయింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లకు మంచి స్పందన రావడంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అన్న అంచనాలతో అభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా విడుదల అయిన ఈమూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ బాలయ్య అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ‘ఖం ఖం ఖంగుమంది శంఖం. భం అఖండ.. భం భం అఖండ’ అంటూ సాగిన ఈ పాటలో బాలకృష్ణ అఘోరా గా త్రిశూలం పట్టుకుని కనిపిస్తున్న లుక్ ను చూసి అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు.


వాస్తవానికి ఈమూవీని వీలైనంత త్వరలో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే సమస్య అంతా ఈమూవీ బయ్యర్లతోనే వస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హడావిడి చేస్తున్న ఈ లీకుల ప్రకారం ఈమూవీని కేవలం ఆంధ్రా ఏరియాకు ౩5 కోట్లకు అమ్మే విధంగా ఎగ్రిమేన్త్స్ కూడ చేసుకున్నారని టాక్.



అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్ల పంచాయతీ ఇంకా తెగని పరిస్థితులలో ‘అఖండ’ మూవీ బయ్యర్లు తాము గతంలో ఒప్పుకున్న రేట్లలో 30 శాతం తగ్గించమని బేరసారాలు ఆడుతున్నట్లు టాక్. ఈవిషయంలో ఈమూవీ నిర్మాతలు తాము గతంలో ఒప్పుకున్న రేట్లను తగ్గించలేము అని చెపుతున్నట్లు తెలుస్తోంది.  



ఇలా ఆంధ్రా ప్రాంతానికి తగ్గిస్తే మిగతా ఏరియాల వారు కూడ తగ్గించమని అడుగుతారని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి నాన్ థియేటర్ అమౌంట్ ఆఫర్లు బాగానే వస్తున్నప్పటికీ ఈ మూవీకి అయిన బడ్జెట్ రీత్యా బయ్యర్లకు రేట్లు తగ్గించలేమని ఈమూవీ నిర్మాతలు చెపుతున్నట్లు టాక్. ఈ సమస్యకు సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ ఒక పరిష్కారం కనుగొనలేకపోతున్నారని అది కుదిరితే ఈమూవీని వీలైనంత త్వరలో విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న బాలయ్య ‘అన్ ష్టాపబుల్’ సూపర్ సక్సస్ కావడంతో ‘అఖండ’ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: