బన్నీతో ఢీకొట్టి వైరం ధనుష్ గా అదరగొట్టిన ఆది...

frame బన్నీతో ఢీకొట్టి వైరం ధనుష్ గా అదరగొట్టిన ఆది...

VAMSI
ఈ మధ్య కాలంలో హీరోలు కూడా విలన్ పాత్రల్లో అలరిస్తున్నారు. హీరోగా అవకాశాలు తగ్గుతున్నాయి అన్న సమయంలో కొందరు హీరోగా ఛాన్స్ లు కోసం వెయిట్ చేస్తూ ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. మరికొందరు హీరోలు నటనపై ఉన్న మక్కువతో ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరియర్ లో దూకుడు పెంచుతున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో ప్రస్తుతం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా మంచి అవకాశం వస్తే అస్సలు మిస్ చేయకుండా ఒకే చెబుతారు నటుడు ఆది పినిశెట్టి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన రవి రాజా పినిశెట్టి తనయుడు అన్న విషయం తెలిసిందే.

"ఒక వి చిత్రం" ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన ఈ హీరో వైశాలి చిత్రంతో బాగా పాపులర్ అయ్యాడు. "నిన్ను కోరి" సినిమా లో నాని మెయిన్ హీరోగా నటించగా ఆది మరో హీరోగా ముఖ్య భూమికను పోషించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో ఏకంగా విలన్ పాత్ర చేసి షాక్ ఇచ్చారు ఆది. అప్పటి వరకు హీరోగా చూసిన ఆది ప్రతినాయకుడి పాత్ర లో చూడటం కాస్త కష్టమేమో అనుకున్న వారికి...తన నటనతో ఏ పాత్రనైనా ఆడాప్ట్ చేసుకోగల గొప్ప నటుడిని నిరూపించాడు. ఇందులో వైరం ధనుష్ గా విలన్ పాత్రలో హీరోకి పోటాపోటీగా నటించాడు ఈ యంగ్ ఆర్టిస్ట్.

ఈ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకోగా...సినిమా విజయం లో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న అజ్ఞాతవాసి సినిమాలోనూ విలన్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించక పోయినప్పటికీ విలన్ గా నటించిన ఆది నటనకి మాత్రం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. సాప్ట్ గా కనిపిస్తూనే విలనిజంలోని వైలెన్స్ చూపించడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్న ఆది విలనిజానికి  ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

తాజాగా ఈ డైనమిక్ నటుడికి విలన్ గా మరో అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అదేనండి దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ హీరోగా చేస్తున్న నూతన చిత్రంలో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇతడి పాత్ర కడప – కర్నులు ప్రాంతాలకు చెందినటువంటి రఫ్ అండ్ టఫ్ పాత్ర అని సమాచారం. మరి ఈ సినిమాలో ఆది ఏ రేంజ్ లో విలనిజం చూపిస్తాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: