ఒకే తరహా పాత్రలో అదరగొట్టిన స్టార్ హీరోలు..??

N.ANJI
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమా హిట్ అయితే అదే తరహాలో మరికొన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే ఒక్కనొక్క సమయంలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అంతేకాదు.. ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే రెడ్డి అనే టైటిల్స్ తో పలు సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెల్సిన విషయమే. సీనియర్ హీరో బాలయ్య సమరసింహారెడ్డి మొదలు కొని నేటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆలా వచ్చిన సినిమాలో కొన్ని విజయాలు అందుకున్నపటికి మరికొన్ని అపజయాలను అందుకున్నాయి. అలా వచ్చిన సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నర్సింహారెడ్డి. ఈ సినిమాని ఉయ్యాల వాడ నర్సింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించారు. ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో కాకపోయిన మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. అలాగే నందమూరి బాలయ్య తొలుత సమరసింహా రెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా అనంతరం బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాను తెరకెక్కించగా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది.

రౌడీ హీరో  విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే సందీప్ హీరోగా తెరకెక్కిన జార్జ్ రెడ్డి సినిమా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా  జాంబిరెడ్డి. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే బీజేపీ నేత జితేందర్ రెడ్డి నటించిన సర్ధార్ చిన్నపరెడ్డి సినిమా కూడా అనుకునంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. నాగ చైతన్య హీరోగా రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శైలజారెడ్డి అల్లుడు. ఈ సినిమా అనుకునంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక 1980లో శారద కీలకపాత్రలో కడప రెడ్డమ్మ సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకునంతా విజయం అందుకోలేదు. మొత్తాన్ని రెడ్డి సినిమాతో వచ్చిన పలు సినిమాలు విజయాలను అందుకోగా.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: