5 మంది స్టార్ హీరోలతో లవ్అంటూ..చీటింగ్ గేమ్ ఆడిన కత్రినా..?
కత్రినాకైఫ్ ఎఫైర్ల విషయానికొస్తే ఇప్పటిదాకా కత్రినా కైఫ్ తన లైఫ్లో ఎంతోమందితో ఎఫైర్లు కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కెరియర్ ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తో కూడా ఈమె ఏడు సంవత్సరాల పాటు ప్రేమ లో ఉన్నది అనే వార్త బాగా వినిపించింది. ఈ విషయాన్ని ఎన్నడూ తను తెలియజేయలేదు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంపై ఎప్పుడు ఓపెన్ గా వ్యవహరించలేదు. ఆ తరువాత విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆ టీం కి మద్దతు ఇచ్చింది.
ఆ తర్వాత హీరో రణబీర్ కపూర్ తో కూడా కొన్ని సంవత్సరాల పాటు లవ్ లో ఉన్నది అని వార్తలు వినిపించాయి. అంతే కాదు అతడితో వివాహం చేసుకోబోతోంది అనే వార్త కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక ఆ తర్వాత హీరో అక్షయ్ కుమార్ తో కూడా కొన్ని సినిమాలలో జోడీ కట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉన్నట్లు గా కూడా బాగా ప్రచారమైంది. ఇక కత్రినా కైఫ్ ఈ విషయాలను ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం విక్కీ కౌశల్ వ్యవహారం కూడా ఇలానే చేస్తుందేమో చూడాలి.