జబర్దస్త్ అప్పారావు లిప్ లాక్.. చూసి అందరు షాక్?

praveen
జబర్దస్త్ అప్పారావు.. ఈ పేరు గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ టీవీలో కామెడీకి కేరాఫ్ అడ్రస్గా.. చిరు నవ్వుకు చిరునామాగా మారిన జబర్దస్త్ కార్యక్రమం లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అప్పారావు. ఇక తనదైన మేనరిజంతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించాడు అనే చెప్పాలి. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గరయ్యాడు. ఇక ఆ తరువాత ఏకంగా జబర్దస్త్ టీం లీడర్ అవతారమెత్తాడు అప్పారావు.

అయితే ఒక వైపు జబర్దస్త్ లో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు  పోతున్నాడు. అయితే జబర్దస్త్ అప్పారావు ఇటీవలే లిప్ లాక్ ఇవ్వడం కాస్త హాట్ టాపిక్ గా మారి పోయింది. జబర్దస్త్ అప్పారావు ఏంటి.. లిప్ లాక్ ఇవ్వడం ఏంటి.. అని ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఇది నిజమే.. అందరూ చూస్తుండ గానే కెమెరా ముందు లిప్ లాక్ ఇచ్చేసాడు. ఇటీవలే సుమ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి తన భార్య తో కలిసి ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ అప్పారావు.

ఈ క్రమం లోనే యాంకర్ సుమ జబర్దస్త్ అప్పారావు కి ఒక టాస్క్  ఇస్తుంది. మీది లవ్ మ్యారేజ్ అయితే ఒకవేళ ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఎలా ఉంటారు అంటూ టాస్క్ ఇవ్వగా.. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను ఏదైనా ఇవ్వడం మర్చిపోయావా అంటూ అప్పారావు భార్య ని అడుగుతాడు.. ఈ క్రమంలోనే చెంపపై ముద్దు పెడుతుంది అప్పారావు భార్య.. అంతేనా ఇంకొకటి కావాలి అంటూ అడుగుతాడు అప్పారావు.. ఈ క్రమంలోనే తన భార్యకు కెమెరాల ముందు ఏకంగా లిప్ లాక్ పెట్టేస్తాడు. దీంతో అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv

సంబంధిత వార్తలు: