మణిశర్మ పై కలవర పాటులో అభిమానులు !

Seetha Sailaja
సంగీత దర్శకుడు మణిశర్మ ఒకప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్. టాప్ హీరోల సినిమాలకు సంగీత దర్శకుడు ఎవరు అంటే ఒకప్పుడు మణిశర్మ పేరు తప్ప మరే ఇతర మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపించేది కాదు. అలాంటి మణిశర్మ ప్రాభవం పూర్తిగా తగ్గిపోయి దేవీశ్రీప్రసాద్ తమన్ ల హవా కొనసాగుతున్న పరిస్థితులలో ఆమధ్య వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తిరిగి మణిశర్మ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అవ్వడమే కాకుండా ఆమూవీలోని పాటలు సూపర్ హిట్ కావడంతో తిరిగి మణిశర్మ హవా ప్రారంభం అయింది అని అనుకున్నారు అంతా.


దీనికితోడు కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ మూవీ ‘ఆచార్య’ కు మణిశర్మ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేయడంతో మణిశర్మ మ్యానియా మళ్ళీ ప్రారంభం అవుతుంది అని అంతా భావించారు. చిరంజీవి కొరటాల లు ఇస్తున్న ప్రోత్సాహంతో మణిశర్మ కూడ ‘ఆచార్య’ మూవీకి మంచి పాటల ట్యూనింగ్ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేసాడు.


అయితే ‘ఆచార్య’ మూవీకి సంబంధించి వరసపెట్టి విడుదల అవుతున్న పాటల ట్యూన్స్ విని మెగా అభిమానులు లో లోపల పెదవి విరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన మొదటి పాట ‘లాహే లాహే’ పాట ట్యూనింగ్ బాగున్నప్పటికీ ఆపాట ట్యూన్ యూత్ కు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా లేదు అన్న కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీలోని రెండవ పాట ‘నీలాంబరి’ పాట ట్యూనింగ్ విన్న మెగా అభిమానులు ఈపాట పై కూడ పెదవి విరుస్తున్నట్లు టాక్.


దీనితో ‘ఆచార్య’ మూవీ పాటల పై మెగా అభిమానులలో టెన్షన్ మొదలైంది. ఒక సినిమా ఘన విజయంలో పాటలు కూడ కీలక పాత్రను పోషిస్తాయి. అలాంటి పరిస్థితులలో యావరేజ్ ట్యూన్స్ తో ‘ఆచార్య’ మూవీ పాటలు ఇలా వరసగా విడుదల అయితే ఈమూవీ క్రేజ్ తగ్గే ప్రమాదం ఉంది అని మెగా అభిమానులు కలవర పడుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి మణిశర్మ సంగీత దర్శకుడుగా పెట్టుకుని కొరటాల తప్పు చేసాడా అంటూ మెగా అభిమానులు అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: