పునీత్ రాజ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ దర్శకుడు..!!
పవన్ తో గుడుంబా శంకర్ సినిమా చేసిన తర్వాత , నేనే సొంత ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేశాను కన్నడలో అని తెలియజేశారు. అందులో కథానాయకుడుగా హీరో రాజ్ పునీత్ కుమార్ అని తెలియజేశాడు. ఆ సినిమా పేరే బసవ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ వీర శంకర్. హీరో పునీత్ తన గురించి మంచి గా చెప్పి సినిమా ఆఫర్ల వచ్చేలా చేశాడని వీరశంకర్ తెలియజేశాడు. అంతేకాదు తనకు కన్నడ, తెలుగు రెండు భాషలు వస్తాయని, 2005 లో నమ్మ బసవ అనే సినిమాను పునీత్ రాజ్ కుమార్ తో కలిసి చేశానని చెప్పాడు.
అంతే కాదు నా గురించి చాలా పాజిటివ్ గా చెప్పి సినిమా వార్తలు ఇప్పించారని పునీత్ రాజ్ కుమార్ గురించి చాలా గొప్పగా చెప్పారు వీర శంకర్.. చాలా గొప్ప హృదయం కలిగిన వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.. ఫిట్నెస్ విషయంలో అందరికీ రోల్ మోడల్ గా పునీత్ రాజ్ కుమార్ ఉంటారని ఆయన తెలిపాడు.. ఇక శివరాజ్ కుమార్ కి కూడా గతంలో హార్ట్ ఎటాక్ వచ్చింది.. అయితే ఆయన ఎంతో ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు అని వీరశంకర్ తెలిపాడు.. పునీత్ కూడా చెస్ట్ పెయిన్ అనుకున్నాడు.. ఇక రోజులాగే వర్కౌట్లు చేశారు కానీ అది ఎఫెక్ట్ పడిందని వీరశంకర్ తెలిపాడు. హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కార్డియాక్ సమస్య వచ్చినట్లు వారు గుర్తించినట్లు వీర శంకర్ తెలిపారు.