బిగ్ బాస్ 5 : హౌస్ లో డాన్సులే డాన్సులు?

praveen
బిగ్బాస్ ఐదవ సీజన్.. ప్రస్తుతం బుల్లితెరపై ఈ కార్యక్రమానికి సంబంధించిన చర్చ జరుగుతోంది.. అయితే ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్ లు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచాయ్. ప్రతి సీజన్ కూడా సరికొత్త రీతిలో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. కానీ బిగ్ బాస్ ఐదో సీజన్ ఫైవ్ మచ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రారంభమైంది. కానీ అటు బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ కొరవడింది అన్నది అర్ధమవుతుంది. బిగ్ బాస్ 5వ సీజన్ మొత్తం పాత చింతకాయ పచ్చడి లాగానే సాగుతోంది.



 ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అయితే ఎంతో చప్పగా ఉంది అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఇక బిగ్బాస్ కార్యక్రమాన్ని చూడటానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు బుల్లితెర ప్రేక్షకులు.. బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమోలలో మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనిపించేలా చేసినప్పటికీ ఇక ఎపిసోడ్ మొత్తం చూస్తే మాత్రం ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అందించే కంటెంట్ కనిపించడం లేదు. ఇక వారాంతంలో నాగార్జున వచ్చినప్పుడు తప్పా బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ ఎక్కడ ఆకర్షించడం లేదు అని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి ఫైర్ కనిపించడంలేదు.


 ఇది ప్రేక్షకులకు అస్సలు నచ్చడంలేదు. ఇకపోతే నాగార్జున వస్తే బిగ్ బాస్ హౌస్ లో సందడి నెలకొంటుంది. ఈ క్రమంలోనే నిన్న నాగార్జున వచ్చి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో పలు టాస్కులు చేయించాడు. ఇక ఈ రోజు బుల్లితెర ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన బిగ్ బాస్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: