బాలయ్య "లెజెండ్" మూవీ ఫ్లాష్ బ్యాక్ వేరే లెవెల్...
మొదట వీరి కాంబినేషన్ లో సింహ మూవీ రాగా అది కూడా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే లెజెండ్ కూడా సూపర్ హిట్ అయ్యి గొప్ప సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో బోయపాటి మాయాజాలం బాగానే పని చేసింది. ఫ్లాష్ బ్యాక్ ను సన్నివేశాలను చిత్రీకరించడంలో ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా అందంగా, అర్థవంతంగా, పవర్ఫుల్ గా బాలయ్య పాత్రను చూపించారు బోయపాటి. ఫ్లాష్ బ్యాక్ ను చూపించే తరుణంలో బలమైన కథనం, ఉర్రూతలూగించే సన్నివేశాలు, గూస్ బమ్స్ తెప్పించే సంభాషణలు బాగానే పడటంతో సినిమా వేరే లెవల్ కి చేరుకుంది.
దీనికి తోడు దేవి శ్రీ అందించిన నేపధ్య సంగీతం కూడా సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. అయితే వయసు పైబడిన బాలయ్య ను యంగ్ పాత్రలో చూపించడంలో కవర్ చేయలేకపోయారు అనే చెప్పాలి. కానీ కంటెంట్ ఉంటే కథ బంపర్ హిట్ డూడ్ అన్నది ఇక్కడ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అలా అన్నివిధాలుగా ఈ సినిమా ఆడియన్స్ ని అలరించి హిట్ ను అందుకుంది. ఫ్లాష్ బ్యాక్ లను చూపించడంలో బోయపాటి తర్వాతే ఎవరైనా అని నిరూపించుకున్నాడు.