రజినీకాంత్ "భాషా" ఫ్లాష్ బ్యాక్ అదుర్స్ అంతే?

VAMSI
టాలీవుడ్ లో చాలా సినిమాలు ఫ్లాష్ బ్యాక్ తో వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది సూపర్ హిట్స్ ను అందుకున్నాయి. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు ఎందరో కదానాయకులు ఫ్లాష్ బ్యాక్ తరహా చిత్రాలలో నటించి సక్సెస్ ను అందుకున్న వారున్నారు. అయితే ఈ పనితనం మొత్తం దర్శకులకే చెందుతుంది. ఫ్లాష్ బ్యాక్ ను కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమయ్యేలా చూపించాలి. అలాగే పవర్ఫుల్ గా చూపించినప్పుడే ఆ కథ మరింత రక్తికడుతుంది. ఆ సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది విజయాన్ని అందుకోగలదు. అలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి... గీతాగోవిందం, అలా మొదలయ్యింది, భాషా, లెజెండ్, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి, మనం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

ముందుగా అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ భాషా చిత్రం చూసుకుంటే...మంచి వసూళ్లతో ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. తమిళ అనువాదంగా తెలుగులో వచ్చిన ఈ చిత్రం ఊహించన స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లో చరిత్ర సృష్టించిన చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అంతేకాకుండా ఆ రోజుల్లో అనువాద చిత్రాలు హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు అలాంటిది ఏకంగా బ్లాక్ బస్టర్ ను మించిన గుర్తింపు పొందింది ఈ చిత్రం. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ హీరో రజినీ కాంత్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బాషా...మాణిక్ బాషా అంటూ ప్లాష్ బ్యాక్ లో రజినీ కాంత్ పాత్ర సినిమాకి ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

మొదట్లో సాదాసీదా వ్యక్తిగా ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ గా కనిపిస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి ఆరాటపడే ఒక మామూలు మనిషిలా కనిపిస్తూ ఉండే మాణిక్యం (హీరో రజినీకాంత్ ) కి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ముంబైనే శాశించిన బాస్ గా చలామణి అయిన దాదాగా ఉన్న మాణిక్ బాషా కి అస్సలు ఎంత తేడా ఉంది అంటే మెత్తటి పత్తికి...రాటుతేలిన కొండకి ఉన్నంత తేడా ఆ రెండు పాత్రలలో ఒకే వ్యక్తి గురించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు సురేష్ కృష్ణ. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో రజినీ చెప్పే  "భాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు" అన్న  డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఎంతగా ఇది ప్రజల మనసుల అంచుల్లోకి వెళిపోయింది అంటే ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా చాలామంది ఇప్పటికీ ఈ డైలాగ్ వాడుతుంటారు. ఈ చిత్రం గురించి అసలు తెలియని చిన్నారులు సైతం ఈ డైలాగ్ ను చెబుతుంటారు అంతగా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఈ సినిమా తెరకెక్కించిన విధానం నీట్ గా క్లియర్ గ ఉంది. ఫ్లాష్ బ్యాక్ ను  కన్ఫ్యూజన్ లేకుండా చూపించిన విధానంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: