సూర్య లేడీ ఫాలోయింగ్ పై జ్యోతిక షాకింగ్ కామెంట్స్
లేటెస్ట్ గా సూర్య జ్యోతిక లు కలిసి నిర్మించిన ‘జై భీమ్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైన సందర్భంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. థియేటర్లలోనే చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి అని అదేవిధంగా పెద్ద స్క్రీన్ కు అతీతంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి అని అంటోంది. అలాంటి వాటికి ఓటీటీ లు బాగా పనికి వస్తాయి అంటూ కామెంట్స్ చేసింది.
అంతేకాదు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ థియేటర్స్ అనేవి పేజీకి ఒక వైపు అన్నట్టు మారిపోయాయి అంటూ నేటి మారిన ట్రెండ్ పై కామెంట్స్ చేసింది ప్రస్తుతం తమ బ్యానర్ లో పదిహేను సినిమాలు రూపొందుతున్న విషయాలను తెలియచేస్తూ వాటిలో కొన్ని థియేటర్లలో విడుదలైతే మరికొన్ని ఓటీటీలో విడుదలకాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
అంతేకాదు తాను సూర్య కథల విషయంలో చాలా ట్రాన్స్ పెరెంట్ గా ఉంటూ వాటి గురించి ఎక్కువగా మాట్లడుకుంటామని తీసే సినిమా కథలో కొత్తదనం గురించి నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉంటామని చెపుతోంది.
ఇక సూర్య గురించి మాట్లాడుతూ సూర్య చాలా రొమాంటిక్ హస్బెండ్ అంటూ తనను పిల్లల బాగా చూసుకోవడమే కాకుండా ప్రొడక్షన్ హౌస్ లో తన భాగస్వామ్యాన్ని సూర్య ప్రోత్సహిస్తాడు అంటూ కామెంట్స్ చేసింది. అయితే సూర్య కు లేడీ ఫాలోయింగ్ బాగా ఉండటం వల్ల తనకు ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటోంది అంటూ జోక్ చేసింది..