ఆ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్రకి తెరపై చెప్పులు విసిరారట...!
ప్రస్తుతం రిపబ్లిక్ మరియు రొమాంటిక్ సినిమా లలో నటించి మెప్పించింది.త్వరలో 'లైగర్' మరియు 'బంగార్రాజు'లలో కనిపించనున్న రమ్యకృష్ణ తన మనసులోని ముచ్చట్లను ఇలా పంచుకుందని తెలుస్తుంది.
ఓ ప్రముఖ డాన్సర్‌గా ఎదగాలన్న కోరికతో చిన్నప్పుడే తాను కూచిపూడి మరియు భరతనాట్యం నేర్చుకుందట. సినిమాల్లోకి వెళ్తే తేలికగా గుర్తింపు వస్తుందని మరిన్ని డాన్స్ ప్రదర్శనలు ఇవ్వొచ్చనీ ఆమె అమ్మకు ఎవరో చెప్పడంతో ఇటువైపు వచ్చిందట.ఆ తరువాత డాన్స్ ప్రదర్శనలు పోయి సినిమాలే తన ప్రపంచం అయ్యాయని అంతేతప్ప తనసలు సినిమాల్లోకి రావాలనుకోలేదని తెలుస్తుంది.
పెళ్లికిముందు తను కృష్ణవంశీ దర్శకత్వంలో 'చంద్రలేఖ' చేసిందని పెళ్లయిన కొత్తల్లో 'శ్రీఆంజనేయం'సినీమాలో నటించిందని ఆ షూటింగ్ సమయంలో తను డైలాగులు వివరిస్తుంటే నవ్వొచ్చేదని అది చూశాక ఇంకెప్పుడూ తన సినిమాలో ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారట ఇకముందైనా ఇస్తారో లేదో చూడాలని చెప్పుకొచ్చిందట.
తనకు గుర్తింపు తెచ్చిన పాత్రల్లో 'నరసింహ'లోని నీలాంబరి ఒకటని రజనీసార్ పక్కన హీరోయిన్‌గా కాకుండా ప్రతినాయిక పాత్ర అనేసరికి కాస్త దిగులుపడ్డానని సౌందర్య పాత్ర తనకు వస్తే బాగుండేదని అనుకుంటూనే అయిష్టంగానే షూటింగ్ పూర్తిచేసిందని సినిమా విడుదలైన మొదటిరోజు ఆమె చెల్లెలు ఓ థియేటర్‌కు వెళ్లిందట అక్కడ తెరమీద తను కనిపించగానే అందరూ చెప్పులు విసరడం మొదలుపెట్టారని సమాచారం.అది విన్నాక తన కెరీర్ అయిపోయిందని భయపడ్డానని కానీ వారం పదిరోజులయ్యాక తన పాత్రకే మంచిపేరు వచ్చిందని తెలిసి ఆనందించిందని తెలుస్తుంది.
'అమ్మోరు' సినిమా మంచి గుర్తింపు తెస్తుందని ఆ సినిమా చేస్తున్నప్పుడు అనుకోలేదట ఆ సినిమా విడుదలైన కొన్నిరోజులకు ఏదో షూటింగ్‌లో ఉన్నా. కొందరు మహిళలు వచ్చి గబగబా తన కాళ్లకు దణ్ణం పెట్టడం మొదలుపెట్టారట
మొదటినుంచీ తను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలితను ఆదర్శంగా తీసుకుంటుందని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నిలదొక్కుకుని ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనం చూశాక తనకి వీరాభిమానిని అయిందట.తను ఆమెను కలవలేదట కానీ జయలలిత పాత్రను క్వీన్ రూపంలో తను చేసినందుకు ఆనందంగా అనిపించిందని చెప్పుకొచ్చిందట.