ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న సమంత...!

murali krishna
స్టార్ కథానాయిక అయినా కూడా ఎప్పుడూ నిర్మాతలకు అందుబాటులో ఉండేదట సమంత. పారితోషికం విషయంలో పేచీ పెట్టిన సందర్భాలు ఇప్పటి వరకూ కనిపించలేదని తెలుస్తుంది.. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమంత పూర్తిగా మారిపోయిందని వార్త వినిపిస్తుంది.

పారితోషికం ఎంత తీసుకోవాలి అనే దానిపై సమంత కాస్త పట్టుదలకు పోతోందని ఇన్ సైడ్ వర్గాల నుంచి వార్త వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.. సమంత ఇటీవల రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకుందని సమాచారం.

ఓ సినిమా కోసం తను రూ.3 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తుంది.సమంత పారితోషికం మొన్నటి వరకూ.. రూ.2 కోట్లలోపే వుండేదని తెలుస్తుంది.పైగా తెలుగులో తను ఈమధ్య సినిమాలు పూర్తిగా తగ్గించేసిందని సమాచారం..

దాంతో పాటుగా కొత్త కథానాయికల హవా పెరగడంతో కమర్షియల్ సినిమాలకు సమంత దూరం అవ్వడంతో తనని నిర్మాతలు లైట్ తీసుకున్నారని కానీ సమంత రూటు మార్చిందని సమాచారం.

మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోందని తెలుస్తుంది.దాంతో కొత్త కథలు వింటోందని తెలుస్తుంది.సమంత ఈమధ్య తెలుగులో సినిమాలు చేయకపోయినాకూడా తన మార్కెట్ తనకుందని కాకపోతే..

మరీ 3 కోట్లు అనేసరికి నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారని సమాచారం.పూజా హెగ్డే మరియు రష్మిక లాంటి వాళ్లు 2 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశారని తనకీ అదే పారితోషికం ఇస్తానంటే కుదరదని మొండికేస్తోందని తెలుస్తుంది.

తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి బ్యాంకు బాలెన్స్ పెంచుకోవడం సమంత టార్గెట్ గాకనిపిస్తోందని సమాచారం. ఇలాగైతే.. నిర్మాతలు సమంతని భరించడం కష్టమని తెలుస్తుంది.కానీ పూజ హెగ్డే మరియు రష్మిక తో పోల్చితే సమంతకు అంత ఇవ్వడం తప్పేమి కాదంటున్నారట ఆమె అభిమానులు. అలాగే కొంత మంది నిర్మాతలు మంచి కథను ఎంచుకొని సమంత కోసం ఎంత  అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని తెలుస్తుంది.కానీ పూజ హెగ్డే మరియు రష్మిక తో పోల్చితే సమంతకు అంత ఇవ్వడం తప్పేమి కాదంటున్నారట ఆమె అభిమానులు. అలాగే కొంత మంది నిర్మాతలు మంచి కథను ఎంచుకొని సమంత కోసం ఎంత  అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: