అక్కినేని అయ్య‌గారు భ‌య‌పెడ్తాడట్రా!

RATNA KISHORE
కెరియ‌ర్ లో ద బెస్ట్ అనిపించుకునే ప‌నులు కొన్ని నాగ చైత‌న్య చేశాడు. మ‌నం సినిమాతో మంచి టాక్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడితో మ‌ళ్లీ సినిమాలు కానీ సిరీస్ లు కానీ చేసేందుకు ఎందుక‌నో ఇష్టప‌డుతున్నాడు. ఆ కోవలోనే ఆయ‌న ఫ్లాప్ ల‌ను ప‌ట్టించుకోకుం డా ఓ క‌థ‌కు అప్పుడెప్పుడో ఓకే చెప్పేశాడు. ఆ క‌థే ఇప్పుడొక వెబ్ సిరీస్ రూపంలో వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. బ‌డ్జెట్ లిమిటే షన్ల‌లో ఆరితేరిన ద‌ర్శ‌కుడు క‌నుక చై కూ, నిర్మాత‌కూ కూడా సేఫ్ ప్రాజెక్టు ఇదే కానుండ‌డం విశేషం.


డిజిట‌ల్ ప్లాట్ ఫాంల‌లో మంచి పేరుతెచ్చుకోవాల‌న్న త‌పన, త‌లంపు సమంత‌కే కాదు చైత‌న్య‌కు కూడా వ‌చ్చేసింది. అవును! ఆ ఉత్సాహంలో భాగంగానే ఆయ‌న కూడా వెబ్ సిరీస్ ల‌పై క‌న్నేశాడు. అయితే ఈ ప‌ని ఎప్పుడో చేయాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా కొన్ని అడ్డంకులు వ‌చ్చాయి.  ఇప్పుడు ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకోవ‌డంతో షూటింగ్ లు కూడా శ‌ర‌వేగంగా సాగుతుండ‌డంతో చై మ‌రింత కాన్ఫిడెంట్ తో కెమెరా ముందుకు రానున్నాడు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప్రాణం ఇచ్చే హీరోలుగా అక్కినేని కుటుంబ వార‌సుల‌కు మంచి పేరు ఉంది. ఆ పేరు నిలిపేలా, డిజిట‌ల్ ఇండ‌స్ట్రీలో ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు చెప్పేందుకు వీలుంద‌ని నిరూపించేలా  చైత‌న్య ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.


ఇప్ప‌టిదాకా ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ తో బండి లాగిస్తున్న అక్కినేని అయ్య‌గారు ఇక‌పై హార‌ర్ జాన‌ర్ లో సినిమాలు చేసేందుకు సై అంటుండ‌డమే విడ్డూరం. ల‌వ్ స్టోరీ సినిమా స‌క్సెస్ తో క‌థా ప్రాధాన్యం ఉన్న సినిమాల ఎంపిక‌కే ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్న నాగ చైత‌న్య ఓ ఓటీటీ లో బ్రాడ్ కాస్ట్ అయ్యే వెబ్ సిరీస్ కు ఓకే చెప్పాడు. ఈ సిరీస్ ను మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ నున్నారు. డిసెంబ‌ర్ నుంచి మొద‌ల‌య్యే ఈ సిరీస్ షూటింగ్ పై నాగ‌చైత‌న్య ఎంతో ఆస‌క్తిగా ఉన్నాడు. గ‌తంలో ఎన్న‌డూ చేయ‌ని విధంగా ఈ పాత్ర ఉండ‌నుంద‌ని చెబుతున్నాడు. ఓ విధంగా త‌న‌కొక ఛాలెంజింగ్ రోల్ ఇది అని కూడా అంటున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైత‌న్య ప్ర‌స్తుతం త‌న సొంత బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న సోగ్గాడే చిన్నినాయ‌న సీక్వెల్ బంగార్రాజులో న‌టిస్తున్నాడు. కృతి శెట్టి క‌థానాయిక. క‌ల్యాణ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే మ‌రికొన్ని క‌మిట్మెంట్స్ ఉన్నాయ‌ని అంటున్నాడు చై.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: