"పుష్ప 2" లో యాంకర్ సుమకు ఛాన్స్?

VAMSI
యాంకర్ సుమ యాంకరింగ్ కు బ్రాండ్ అంబాసిడర్, అంతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తనని తాను నిరూపించుకున్నారు సుమ. గత పదిహేను ఏళ్లుగా ఎందరో యాంకర్లు వస్తున్నారు, పోతున్నారు, కొందరు తమ టాలెంట్ తో బాగా పాపులర్ అవుతున్నారు. కానీ సుమ మాత్రం లోకల్ తనని కాదని బిగ్గెస్ట్ షో లు ఎంత వారి చేతికైనా వెళ్లడం కష్టమే. సుమ స్టేజ్ పై ఉందంటే ఆ థ్రిల్లే వేరు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కితకితలు పెట్టించడంలో ఈ యాంకర్ మంచి దిట్ట. అది ఆమెకు స్వతహాగా వచ్చిందో ఏమో కానీ, కాస్త కూడా బార్డర్ క్రాస్ చేయకుండా స్టార్ యాక్టర్లపై కూడా సింపుల్ గా పంచ్ లు వేసేయగలదు.
ఈ బుల్లితెర మహారాణి మొదట సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వారే. అయితే ఇపుడు మళ్ళీ సినీ బాట పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సుమ సినిమాలు చేస్తే పోలా..అంటూ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్ళకి ఆమె ఓ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 2 లో ఈమె ఓ కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈమె పాత్ర , వాటి వివరాలను కూడా టీం తో చర్చించారట సుమ కనకాల. అన్ని నచ్చి కుదరడంతో స్టైలిష్ స్టార్ మూవీలో తిరిగి వెండి తెరపై మనల్ని అలరించేందుకు తిరిగి వచ్చేస్తున్నారు సుమ అంటూ టాలీవుడ్ నుండి టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
పూర్తి వివరాలు, త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 విడుదలకు ముస్తాబవుతోంది. ఇక పార్ట్ 2 లో సుమ కనిపించబోయేది నిజమే అయితే...ఏ పాత్రలో రీ ఎంట్రీ ఇస్తారో..అంటూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు. ఓ వైపు బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ వార్త నిజమవ్వాలని కోరుకుంటున్నారు. సుమ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాకి మంచి ప్లస్ అవుతారు అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: