"లైగర్" నుండి మరో సస్పెన్స్ సర్ప్రైజ్ ?

VAMSI
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం "లైగర్" చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై మెగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అనతి కాలంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించనున్నారు. ఇందులో విజయ సరసన బాలీవుడ్ బామ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తున్న విషయం విదితమే. ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం అని అంతా అంటున్నారు. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు అండ్ వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయినటువంటి మైక్ టైసన్ కూడా ఉండడంతో ఈ సినిమా స్థాయి మరో మెట్టు పెరిగిందనే చెప్పాలి.

నేడు దీపావళి సందర్భంగా మేకర్స్ టైసన్ కు సంబంధించి అదిరిపోయే పవర్ఫుల్  పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ కాగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.  మరో కొద్ది రోజుల్లో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫైట్ సీన్ ఒకటి రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అది బాక్సర్ గా రింగ్ లో చేసే ఫైటా లేక...బయట మన విలన్ లతో చేసే ఫైట అన్నది మరొక సస్పెన్స్ గా మారింది. విజయ్ దేవరకొండ ను పక్క యాక్షన్ ఫిల్మ్ లో వెండి తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ కోసం తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇపుడు విజయ్ కు సంబందించిన ఫైట్ వీడియో వస్తుందన్న వార్తలు అందరినీ ఆనంద పరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: