నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే
బాలకృష్ణ తెలుగు
మాస్ దర్శకులలో ఒకరైన
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ
సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సరైన సమయం చూసి
థియేటర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ
సినిమా తర్వాత
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు
బాలకృష్ణ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇలా ఇప్పటికే ఒక సినిమాను పూర్తి చేసి, మరొక
సినిమా ను లైన్ లో పెట్టి రెడీగా ఉన్న
బాలకృష్ణ ఈ మధ్యలో తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపాబుల్ అనే ఒక టాక్ షో హోస్ట్ గా వ్యవహరించ బోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ టాక్ షో కు సంబంధించిన ప్రచార చిత్రాలు, ప్రోమోలు ఇప్పటికే నెట్టింట్లో ఫుల్ వైరల్ గా మారిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇలా ఇప్పటికే ప్రచార చిత్రాలు, ప్రోమో లతో జనాలలో ఫుల్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ టాక్ షో
దీపావళి సందర్భంగా
నవంబర్ 4వ తేదీన మొదటి
ఎపిసోడ్ ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి
ఎపిసోడ్ కు మంచు
మోహన్ బాబు, మంచు విష్ణు,
లక్ష్మీ లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. మొదటగా ఈ టాక్ షో లో
బాలకృష్ణ,
మోహన్ బాబుతో ముచ్చటించగా, ఆ తర్వాత విష్ణు, లక్ష్మి లు ఎంటర్ అయ్యారు. విష్ణు మరియు
లక్ష్మీ,
బాలకృష్ణ తో ముచ్చటిస్తూ నవ్వులు పూయించారు.
బాలకృష్ణ,
మంచు లక్ష్మి ని నువ్వు మీ నాన్నతో చివరిగా ఎప్పుడు అబద్ధం ఆడావు అని అడగగా, నేను ఉదయం కూడా నాన్నతో అబద్దం ఆడినట్టు ఉన్నాను అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది. నేను నాన్నతో చాలా అబద్ధాలు ఆడుతాను అని అమ్మతో మాత్రం నిజాలు చెబుతాను అంటూ
మంచు లక్ష్మి తెలియజేసింది. ఇలా ఈ టాక్ షో లో
మంచు లక్ష్మి సరదాగా నవ్వులు పూయించింది.