కోలీవుడ్ తో పాటు
టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఇంకా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న
హీరో సూర్య శివ కుమార్. విభిన్నమైన కథలను ఇంకా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటుడు సూర్య.ఇక ఈ మధ్యనే ఆకాశం నీ హద్దు
రా అనే సినిమాతో మంచి
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఈ
సినిమా దేశమంతటా కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.
ఎయిర్ ఇండియా సృష్టికర్త గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ
సినిమా ప్రేక్షకులని కట్టిపడేసింది.ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు జై
భీమ్ గా ఆకట్టుకోడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే
సూర్య నటించిన జై భీమ్ సినిమాలోని ఓ సన్నివేశంపై
రచ్చ రచ్చ నడుస్తోంది.ఇక ఈ సినిమాలో హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్‌రాజ్ చెంపచెళ్లుమన్పించే సన్నివేశంపై ఇప్పుడు వివాదం నెలకొంది.
ఇక హిందీలో కాదు తమిళంలో మాట్లాడూ.. అంటూ ఈ క్యారక్టర్ లో చెంపచెళ్లుమన్పిస్తాడు ప్రకాశ్‌రాజ్.. ఇక దీంతో
హిందీ అభిమానులు ఆ సన్నివేశం పై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ జాతీయ భాష అయిన హిందీని ద్వేషించే వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.ఇక
హిందీ మాట్లాడే వ్యక్తిని జై భీమ్ సినిమాలో తమిళంలో మాట్లాడాలని ప్రకాశ్‌రాజ్ కొట్టే సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.జై భీమ్
సినిమా తమిళం సినిమా. ఈ
సినిమా హిందీతో పాటు చాలా భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. ఇక హిందీపై ద్వేషాన్ని రగిల్చే విధంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నన్ను ఎందుకు కొడుతున్నారు సార్ అని వడ్డీ వ్యాపారి పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రకాశ్‌రాజ్‌ను అడిగితే తమిళంలో మాట్లాడూ అంటూ ఇందులో
ప్రకాష్ రాజ్ ఆర్డర్ ఇస్తారు.