లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న
శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.కన్నడ నాట ఆల్రౌండర్ యాక్టర్ గా పునీత్ సంపాదించిన పేరు, క్రేజ్ ఇంకా ఆయన సొంతం చేసుకున్న ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. కొన్ని లక్షల మంది అభిమానులు
పునీత్ రాజ్ కుమార్ సొంతం.దివంగత లెజండరీ
హీరో రాజ్
కుమార్ గారి ముద్దుల వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన పునీత్ తన
తండ్రి లాగానే
కన్నడ నాట విపరీతమైన
మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక
పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని సినీ ప్రేమికులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న
పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణంతో టాలీవుడ్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.