బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన బాలకృష్ణ ఈ సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాపై జనాల్లో కూడా ఫుల్ గా క్రేజ్ ఉంది, దానికి ప్రధాన కారణం ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన  సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలపడమే. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో తో కూడా జనాలను అలరించడానికి రెడీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ప్రోమో ను కూడా ఆహా నిర్వహణ బృందం బయటకు బదులుగా, దీనికి జనాల నుండి మంచి స్పందన లభిస్తోంది.


ఈ షో లో భాగంగా నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటగా మంచు ఫ్యామిలీతో ముచ్చటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో ను కూడా ఆహా నిర్వాహక బృందం బయటకు వదిలింది, దీనికి కూడా జనాలు నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇటు సినిమాలు, అటు షో లతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలకృష్ణ ఈ దీపావళికి తన అభిమానులకు అదిరిపోయే సప్రైజ్ ఇవ్వనున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకు సంబంధించిన రెండవ లిరికల్ సాంగ్ ప్రోమో ను దీపావళి సందర్భంగా ఈ నెల 4వ తేదీన 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. అలాగే పూర్తి లిరికల్ పాటను నవంబర్ 8 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ మొట్టమొదటి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో మొదటి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుండి ప్రసారం కాబోతుంది. ఇలా బాలకృష్ణ తన అభిమానులకు ఒకే రోజు రెండు అదిరిపోయే కానుకలను ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: