ప్రేక్షకులు ఊహించలేదు.. చివరికి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు?

praveen
చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా రాణిస్తారు అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదృష్టం కలిసి రావాలి గాని సాదాసీదా నటులు కూడా స్టార్ హీరోగా మారి పోతూ ఉంటారు. చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన వారు కూడా ఏకంగా ఇండస్ట్రీలో హవా నడిపించే స్టార్ హీరో రేంజ్ లో సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఒకప్పుడు చిన్న పాత్రలో నటించిన వారు స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇక ఇలా తెలుగు ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యపరిచిన హీరో ఎవరు అంటే నేటి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్.



 ఒకప్పుడు బన్నీ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఎవరో తెలియదు.. ప్రేక్షకుల మదిలో మాత్రం ఎప్పుడో బన్నీ గురించి ఆలోచన మొదలైంది.. ఎలా అంటారా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో మెగాస్టార్ దగ్గర డాన్స్ నేర్చుకునే యువకుడిగా అల్లు అర్జున్ ఉంటాడు. అంతే కాదు చిరంజీవి ఇన్స్టిట్యూట్లో మెగాస్టార్ ప్రియ శిష్యుడిగా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూంటాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కి ఆక్సిడెంట్ అవ్వడం  ఆపరేషన్ చేస్తే కాళ్లు వస్తాయని డాక్టర్లు చెప్పడంతో చిరంజీవి సహాయం చేస్తాడు. ఇక ఇదే సమయంలో సినిమా కథ మలుపు తిరుగుతుంది..


 ఇలా చిరంజీవి హీరోగా నటించిన సినిమా లో ఒక చిన్న పాత్రలో కనిపించి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు ఎవరు ఈ కుర్రాడు అని తెలుగు ప్రేక్షకులు ఆలోచించే విధంగా చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఆకట్టుకునే డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్గా.. అదిరిపోయే నటనకు చిరునామాగా.. ప్రేక్షకులందరికీ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అలా ఒకప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ సినిమాలో కనిపించినప్పుడు ఏ ప్రేక్షకుడు కూడా ఊహించలేదు అల్లు అర్జున్ కి ఇంత పెద్ద హీరో అవుతాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: