అబ్బాయిని ఆకాశంలోకి ఎత్తేసిన బాబాయిలు !

Seetha Sailaja
పూరీ జగన్నాథ్ కు అతడి తమ్ముళ్ళు అంటే విపరీతమైన ప్రాణం. ఆ ఇష్టంతోనే పూరీ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను హీరోగా చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. ఆ విషయంలో పెద్దగా సక్సస్ కాలేకపోయినా మరొక తమ్ముడు ఉమా శంకర్ ను ఎమ్ ఎల్ ఏ గా చేసి తన సొంత ఊరులో తమ కుటుంబ ఇమేజ్ పెంచుకున్నాడు.



తన సొంత ఊరు నర్సీపట్నంలో ఆకాష్ పూరీ నటించిన ‘రొమాంటిక్’ మూవీ విడుదల సందర్భంగా ఆ మూవీ మొదటిరోజు మొదటి షోను ప్రేక్షకులతో కలిసి చూసినప్పుడు స్క్రీన్ పై ఆకాష్ కనిపించగానే ప్రేక్షకులతో పాటు కలిసి బాబాయిలు ఇద్దరు ఈలలు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పూరీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మొదటిరోజు కోటి రూపాయలకు పైగా నెట్ కలక్షన్స్ వచ్చాయి అని అంటున్నారు.



ఈ వార్తలే నిజం అయితే ఒక కొత్త హీరో సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ రావడం మంచిదే అని అంటున్నారు. మాస్ హీరోగా రాణించే లక్షణాలు ఆకాష్ కు ఉన్నప్పటికీ ఎన్నో మాస్ సినిమాలను తీసిన పూరీ తన కొడుకు విషయంలో ఎందుకు సక్సస్ కాలేకపోతున్నాడో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. భవిష్యత్ లో ఆకాష్ పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విమర్శకులు చెపుతున్నప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో ఆకాష్ తడబడ్డాడు అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ మూవీకి 5 కోట్ల మేర బిజినెస్ జరిగిన పరిస్థితులలో ఈమూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీ యూత్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో ఆకాష్ దురదృష్టం మరొకసారి తప్పించుకోలేకపోయాడు అని అనుకోవాలి..  అయితే ఈమూవీకి పోటీగా వచ్చిన ‘వరుడు కావలెను’ మూవీకి కూడ డివైడ్ టాక్ రావడంతో ఆకాష్ అదృష్టం ఎలా ఉందో ఈ వీకెండ్ కు తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: