వామ్మో: ప్ర‌భాస్ స్పిరిట్‌కు వంగ సందీప్‌కు అంత రెమ్యున‌రేష‌నా..!

VUYYURU SUBHASH
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. విజ‌య్ దేవ‌ర‌కొండ - షాలినీ పాండే మ‌ధ్య కెమిస్ట్రీ ఆ సినిమాలో ఎంత లా వ‌ర్క‌వుట్ అయ్యిందో... ఆ సినిమా చూసి మ‌న తెలుగు యూత్ కు కిక్కెక్కి పోయి ఎంత‌లా పిచ్చెక్కిపోయారో చూశాం. ఆ సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు వంగా సందీప్. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో అందించి దేశ వ్యాప్తంగానే యువ‌త తో పాటు యంగ్ హీరో ల‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

తొలి సినిమా త‌ర్వాత వంగ సందీప్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌హేస్ ను క‌లిసి మ‌నోడు క‌థ కూడా చెప్పాడు. త‌ర్వాత ఏమైందో కాని ఆ ప్రాజెక్టు ప‌ట్టా లెక్క‌లేదు. ఇప్పుడు మ‌హేష్ కు చెప్పిన క‌థ నే కాస్త అటూ ఇటూ మార్చి ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కుతోంది. రు. 400 కోట్ల బ‌డ్జెట్ అ ని టాక్ ?

ఒక్క ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ కిందే రు. 150 కోట్లు ఇస్తున్నార‌ట‌. ఇదిలా ఉంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్నందుకు డైరెక్ట‌ర్ సందీప్ కు రెమ్యున‌రేష‌న్ లేద‌ట‌. అయితే లాభాల్లో 50 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ని అంటున్నారు. ఇదే అత‌డికి రెమ్యున‌రేష‌న్ గా ఉంటుంద‌ట‌. సినిమా బిజినెస్ జ‌రిగాక వ‌చ్చే లాభాల్లో 50 శాతం వాటా అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తోన్న‌ సలార్, ఆదిపురుష్ , నాగ్ అశ్విన్ సినిమాల త‌ర్వాత ఈ సినిమా ఉంటుంది. ఇవి పూర్త‌య్యే స‌రికే మ‌రో రెండేళ్లు ఈజీగా ప‌ట్టే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: