ఆ సినిమాలు ఆడవని బన్నీకి ముందే తెలుసట...!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారడానికి అతను చేసిన సినిమాలే కారణమని అందరికి తెలుసు.. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా రెగ్యులర్ హీరోలకి భిన్నంగా కథల్ని మరియు పాత్రలని ఎంపిక ఎంచుకుని ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడని తెలుస్తుంది..మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా తాను నిలబడగలనని అలాగే పెద్ద స్టార్ గా ఎదగగలనని తన సినిమాలతో చెప్పకనే చెప్పాడని తెలుస్తుంది.

అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఓ సినిమా కథ మరియు కథనాలు జడ్జ్ చేయకుండా ముందడుగు వేయలేడని సమాచారం.

అతను ఎంత రిస్కీ సబ్జెక్టుని ఎంపిక చేసుకున్నా కానీ అందులో అతని అభిమానులను అలరించే అంశాలు ఉండాలని కోరుకుంటాడని తెలుస్తుంది.అయితే మన బన్నీ మాత్రం వీటన్నిటినీ పక్కన పెట్టేసి ప్లాప్ అవుతాయని తెలిసి కూడా రెండు సినిమాల్లో నటించాడని తెలుస్తుంది.. స్వయంగా బన్నీనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైములో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.బన్నీకి 'ఆర్య' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ దానికి సీక్వెల్ గా 'ఆర్య 2' చేసాడని అందరికి తెలుసు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తెలుస్తుంది.


అయితే దీని చిత్రీకరణ సమయంలోనే బన్నీకి అనిపించిందని తెలుస్తుంది. 'ఇది 'ఆర్య' అంత విజయవంతం కాదు' అని తెలుస్తుంది.అలాగే క్రిష్ డైరెక్షన్లో చేసిన 'వేదం' కూడా హిట్టవ్వదని బన్నీకి ముందే తెలుసని సమాచారం.. అయినప్పటికీ ఆ సినిమా చేశాడని 'భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే తనకంటూ కొన్ని విభిన్న తరహా చిత్రాలు మరియు పాత్రలు చేశాననే తృప్తి ఉండాలని ఆ సినిమాలు చేసినట్టు' బన్నీ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.వేదం సినిమా బన్నీ లోని కొత్త నటుడిని పరిచయం చేసిందని చెప్పవచ్చు. మళ్ళీ అలాంటి పాత్రనే పుష్ప సినిమాలో చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: