నా మాటల్లో ఫిల్టర్ ఉండదు.. బాలయ్య పంచ్ డైలాగ్..

Deekshitha Reddy
పంచ్ డైలాగుల్లో బాలయ్య రూటే సెపరేటు.. అందులోనూ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ఆయన తొలిసారిగా  షో చేస్తున్నారు. అన్ స్టాపబుల్ అంటూ వస్తున్న బాలయ్య కోసం సెపరేట్ గా పంచ్ డైలాగులు రాసుకున్నారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, సంకల్ప శుద్ధి.. అంటూ ఎంట్రీలోనే బాలయ్య అదరగొట్టారు. వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటూ తన సినిమాల్లోని పంచ్ డైలాగుల్ని మళ్లీ రిపీట్ చేశారు. దెబ్బకు థింకింగ్ మారిపోవాల అంటూ మాస్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

 
అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం చేస్తున్న కార్యక్రమం ఇంటర్వ్యూలతో సాగుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలకు వచ్చే వ్యక్తులు అన్నీ నిజాలే చెప్పాలి, ఫిల్టర్ లేకుండా ఉండాలి అనేది దీని కాన్సెప్ట్. మరి వచ్చేవారంతా నిజంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారో లేదో కానీ.. నా మాటల్లో ఫిల్టర్ ఉండదు అంటూ బాలయ్య ముందుగానే దీనికి సంబంధించిన హింట్ ఇచ్చారు. అంటే దాదాపుగా ఇది ఫిల్టర్ లెస్ షో అనమాట. మనసులో ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతారు. అలా మాట్లాడించడమే బాలయ్య గొప్పదనం.
ఇప్పటి వరకూ టీవీ షో కోసం, ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం చాలానే ఇంటర్వ్యూలు జరిగాయి. అయితే అన్ని చోట్లా ర్యాపిడ్ ఫైవ్ రౌండ్లు, మీకు నచ్చినవి, నచ్చనివి అంటూ రొటీన్ డైలాగులే ఉండేవి. కానీ తొలిసారిగా బాలకృష్ణ ఈ షో కోసం కాస్త వెరైటీగా ట్రై చేస్తున్నారు. ఈమాత్రం వెరైటీ ఉంటుంది కాబట్టే ఆయన ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ అన్ స్టాపబుల్ అనే దాన్ని ఓ సంచలనంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిల్టర్ లెస్ షో అంటూ క్లారిటీ ఇచ్చేశారు నిర్వాహకులు. అయితే ఇలాంటి షో లు ముందు అనుకున్న కంటెంట్ ఒకటి, ఆ తర్వాత ఒకటి అన్నట్టుగా తయారయ్యే ప్రమాదం ఉంది. డిఫరెంట్ టాక్ షో అంటూ మొదలు పెట్టి, రొటీన్ ఇంటర్వ్యూ కార్యక్రమంలాగా ముగిస్తే మాత్రం అన్నిటిలీ ఇది కూడా ఒకటి అయ్యే ప్రమాదం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: