"కేజిఎఫ్ 2" లో రమికా సేన్ పాత్ర విద్వంసాన్ని సృష్టిస్తుందా?

VAMSI
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నడ చిత్రం "కేజిఎఫ్" సినిమా రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇటు తెలుగులోనూ సునామీ లాంటి వసూళ్ల వర్షం కురిపించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సృష్టించిన సంచలనం  అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇపుడు ఈ మూవీకి సీక్వెల్ గా "కేజిఎఫ్" 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఇపుడు అంతకు మించి ఉండబోతుందని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లో  రమిక సేన్‌ అనే కీలక పాత్రలో రవీనా టాండన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర మూవీలో ఎంతో శక్తివంతమైన పాత్ర అట, సినిమాకి ఎంతో కీలకం కానుందని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ పాత్రకు సంబందించి కొన్ని షాట్స్ కూడా తీశారు. ఆ సమయంలో రవీనా నటనా ప్రతిభ చూసి అంతా ఆశ్చర్యపోయారు అని వార్తలు కూడా వినిపించాయి. అంతగా ఈ పాత్ర కోసం ప్రాణం పెడుతున్నారట రవీనా. ఇక నిన్న మంగళవారం రోజున రవీనా బర్త్డే సందర్భంగా  రవీనా పాత్రకు సంబందించి కొత్త లుక్‌ను  సోషల్ మీడియా లో పంచుకున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ పోస్ట్ లో ఆయన ఏమన్నారంటే, ''ఇందులో రమిక పాత్రని మీరు తప్ప ఇంకెవరూ అంత అద్భుతంగా చేసి ఉండలేరేమో...మీరు గొప్ప యాక్టర్ అంటూ రవీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

డైరెక్టర్ మాటలతో ఈ పాత్రకు మరింత ప్రాధాన్యత వచ్చినట్లయింది. గతంలో ఇండియా ప్రధాని ఇందిరా గాంధీలాగా తన పాత్ర ఉండనుందని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ లో ఈ పాత్ర చాలా బాగా ఎలివేట్ అవుతుందని చిత్ర యూనిట్ అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యశ్ కి ఈ పాత్రకు మధ్యన వచ్చే సన్నివేశాలు శరీరంపై రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: