అందాల ముద్దుగుమ్మ
ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతో
కోలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత
టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అలా భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన
కౌసల్య కృష్ణమూర్తి అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్
సినిమా లో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా
ఐశ్వర్య రాజేష్ నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇలా తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన
ఐశ్వర్య రాజేష్ కు తెలుగునాట పర్వాలేదు అనుకునే రేంజ్ లోనే ఆఫర్లు వచ్చాయి.
అందులో భాగంగా
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన
వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించిన
ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాతో జనాలను మెప్పించింది. అలాగే ఈ మధ్య ఓటిటి లో విడుదలైన
టక్ జగదీష్ సినిమాలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానన్ని ఏర్పరచుకుంది. ఇ లా తెలుగు,
తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో సోషల్
మీడియా వేదికగా అనేక విషయాలను పంచుకునే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా
ఐశ్వర్య రాజేష్ కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు
ఐశ్వర్య రాజేష్ ఏ మాత్రం అందాలు ఓలకబోయకొండ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.