పూజ హెగ్డే మ్యానియా తో అఖిల్ కు ఎదురీత !

Seetha Sailaja
దసరా సినిమా రేస్ సీజన్ పూర్తి అవ్వడంతో ఈసారి దసరా విజేత ఎవ్వరు అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో ప్రారంభం అయ్యాయి. ఈసారి దసరా సీజన్ కు మూడు మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ ఘోరమైన ఫ్లాప్ గా మారితే శర్వానంద్ ‘మహాసముద్రం’ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.  

దీనితో పండుగలలో సినిమాలు చూడాలి అని అనుకునే వారికి అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ భ్యాచిలర్’ ఫస్ట్ ఛాయస్ గా నిలిచింది. ఈసినిమాకు ఎబో ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ చూడటానికి ఈ దసరా సీజన్ లో మరే సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు ఈసినిమాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమా చూసినవారు అంతా అఖిల్ గురించి మాట్లాడుకోకుండా చాలామంది ఎక్కువగా పూజ హెగ్డే గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

మొదటిరోజున ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’ కు మంచి ఓపెనింగ్సే వ‌చ్చాయి. ఆతరువాత రోజు వచ్చిన వీకెండ్ శ‌ని ఆదివారాలలో ఈమూవీ కలక్షన్స్ పర్వాలేదు అని అనిపించుకున్నా ఆతరువాత వచ్చిన మొదటి సోమవారం రోజున ఈమూవీ కలక్షన్స్ లో స్పీడ్ తగ్గింది. దీనితో ఈమూవీ కేవలం ఏవరేజ్ హిట్ గా మాత్రమే నిలబడుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న డిజాస్ట‌ర్ మూవీ ఆరెంజ్ త‌ర‌హాలోనే మ‌ళ్లీ ప్రేమ‌ పెళ్లి వైవాహిక జీవితం అన్న సబ్జెక్ట్ తీసుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ సిల్లీ గా అనిపించే లాజిక్ లెస్ సీన్లు చాల ఉండటంతో ప్రేక్షకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. అయితే ఈసినిమాకు ఈమాత్రం అయినా కలక్షన్స్ వస్తున్నాయి అంటే అది కేవలం పూజ హెగ్డే మ్యానియా మాత్రమే అంటున్నారు. ఈసినిమాను చూసిన యూత్ పూజ గ్లామర్ కు ఆకర్షితులు అవుతున్నారు కానీ ఎక్కడా అఖిల్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఈసినిమాలో పూజ అందం అభిన‌యం రెండిటితోనూ ఆక‌ట్టుకుంది. దీనితో ఆమె ముందు అఖిల్ నిలబడలేకపోయాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు హిట్స్ లేక ఒక బాధ అయితే ఇప్పుడు తాను కోరుకున్న హిట్ వచ్చినప్పటికీ ఈసినిమా అఖిల్ కెరియర్ కు ఏమాత్రం సహకరించదు అన్నకామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: