ఎట్టకేలకు ఒక మంచి సక్సెస్ను అందుకున్న నాని హీరోయిన్..?

Divya
నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం నానీస్" గ్యాంగ్ లీడర్"..ఈ చిత్రం నానికి మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహ‌న్ నటించింది.ఈ సినిమా విడుదలైన తర్వాత ఈమె ఎంతో క్రేజ్ దక్కించుకుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా హీరోయిన్లను తన సినిమాలో నటించే టువంటి హీరోయిన్లను ఎంతో అందంగా ఉండేలా చూపిస్తారు. ఇక అదే విధంగా వారి నటనను కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేలా ఎంచుకుంటాడు.

ప్రియాంక తన నటనతో ప్రేక్షకులను మెప్పించినప్పటికి ఈ సినిమా ఈమె తన కెరీర్ ని మార్చలేక పోయింది. ఇక శర్వానంద్ తో చేసిన శ్రీకారం సినిమా కూడా ఫ్లాప్ లిస్టు లోకి వెళ్లిపోవడంతో ఈమె కెరియర్ అయోమయంలో పడింది. అయితే తాజాగా ఈమె నటించిన ఒక చిత్రం మంచి హిట్ ను అందుకుంది. ఆ చిత్రం ఏమిటంటే "వరుణ్ డాక్టర్".
ఇక ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఈ మూవీలో నటించాడు.గ్యాంగ్ లీడర్ మూవీ లో చేసిన పాత్రని ఈమె ఈ సినిమాలో కూడా చేయడంతో ఈ సినిమాకి ప్లస్ గా నిలిచింది. అయితే ఈసారి మాత్రం ఈమె సినిమా పక్కాగా హిట్ టాక్తో నిలబడింది.
ఇక ఈ సినిమాలో ఈమె ప్రధాన పాత్రలో నటించి, అందుకు తగ్గట్టుగా ఈ మూవీ లో ప్రియాంకతో కామెడీ చేయించడంతో ప్రేక్షకులు ఈమె చేసినటువంటి పాత్రలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన విడుదలైంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక హీరోయిన్ ప్రియాంక ఈ చిత్రం సక్సెస్ తో మరిన్ని అవకాశాలు వస్తాయేమో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: