శర్వానంద్ మరియు సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న 'మహా సముద్రం'
సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిన విషయమే.
rx 100 లాంటి
బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు
అజయ్ భూపతి విభిన్న కథాంశంతో 'మహా సముద్రం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
ఇన్‌టెన్స్ లవ్ మరియు యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై
సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అదితిరావు హైదరి మరియు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారని అందరికి తెలుసు.
దసరా కానుకగా
అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయం కూడా అందరికి తెలుసు.
తాజాగా
అజయ్ భూపతి మాట్లాడుతూ..
ఆర్ఎక్స్ 100 లాంటి
బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరు హీరోల కథలు రాసుకుని చాలామంది హీరోలను ఒప్పించడానికి ప్రయత్నం చేశానని ఈ కథని అందరూ ఇష్టపడ్డారని సోలోగానే హీరోగా చేయాలని అనుకున్న వాళ్లు కూడా ఈ కథ చాలా అద్భుతంగా ఉందని బయట చాలా మందితో చెప్పారు అన్నారని చెప్పారట అజయ్.
ఆర్ఎక్స్ 100 సినిమా కంటే ముందే శర్వానంద్ తో ఒక
సినిమా చేయాలని అనుకున్నానని కానీ అప్పుడు ఆయనను కలిసే అవకాశం దొరకలేదని ఇక
రావు రమేష్ ద్వారా శర్వాని కలిసే అవకాశం దొరికిందని చెప్పుకొచ్చారట. సిద్దార్థ్ కు శర్వానంద్ కంటే ముందే ఈ కథలు చెప్పి ఒప్పించానని ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న సమయంలోనే
కరోనా అడ్డుపడిందని ఇక ఫస్ట్ వేవ్ అనంతరం షూటింగ్స్ మొదలుపెట్టినప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే ఈ
సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేయడం జరిగిందని చెప్పుకొచ్చారట.నిజంగా ఇది ఒక భావోద్వేగాల
ప్రేమ కథని ఒకరి జీవితాలను మరొకరు జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపించేది అనేది ఇందులోని ప్రధానాంశం అని అన్నారట అజయ్.
మహా సముద్రంలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుందని మన సముద్రంలో
హీరో అనేది కథ మాత్రమేనని ఇద్దరు హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తావో.. చూస్తాను అని
రాంగోపాల్ వర్మ గారు కూడా అన్నారట.సిద్దార్థ్ శర్వానంద్ ఇద్దరు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారని వారిద్దరూ లేకపోతే ఈ
సినిమా ఇంత బాగా వచ్చేది కాదుని నేను ఏది చెబితే అదే చేశారని
నిర్మాత అనిల్
సుంకర కూడా ఎంతగానో సపోర్ట్ చేశారుని
అక్టోబర్ 14న తెలుగు
సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చూడబోతోందని చెప్పారట ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఎవరు మర్చిపోరని పక్కా ఇది
బ్లాక్ బస్టర్ మూవీ అని
పోస్టర్ కూడా రెడీ చేసుకోండి అని మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాము“ అని
అజయ్ అన్నారని సమాచారం.