సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక వాళ్ళకి పండగే?

praveen
కరోనా వైరస్ కారణంగా సినీరంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది.  ఇలాంటి సమయంలో థియేటర్ల యజమానులు తీవ్రంగా దెబ్బతిన్నారు.  ఇటీవలే కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్ లు తెరుచుకున్నాయి.  అయితే అటు తెలంగాణలో పూర్తిగా 100 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్ల నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అటు ఏపీలో మాత్రం జగన్  సర్కార్ థియేటర్లు తెరవడం పై కాస్త మొండిపట్టు తోనే ఉంది. థియేటర్ లు తెలుసుకోవాలని అనుమతి ఇచ్చినప్పటికీ కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే థియేటర్లు నడిపించాలి అంటూ ఒక నిబంధన విధించింది.

 ఇలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలకు ఎంతో ఇబ్బందికరంగా మారిపోయింది అని చెప్పాలి. చాలామంది థియేటర్ల యాజమాన్యాలు 50% ఆక్యుపెన్సీ తో సినిమా హాల్ ను  నడిపేందుకు ముందుకు రాలేదు. దీంతో చాలా థియేటర్లు మూత పడ్డాయి.  అయితే తెలుగు సినిమా పరిశ్రమఫై వైయస్ జగన్ ప్రభుత్వం మొండి వైఖరి గా వ్యవహరిస్తుంది అంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కాగా ఇటీవల జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూడా 100% ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.

 రేపటి నుంచి థియేటర్ల యాజమాన్యాలు 100% సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను నడిపించు కోవచ్చు  అంటూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇలా 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించినప్పటికీ  కరోనా వైరస్ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి థియేటర్ వద్ద మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా ఉండాలి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. కాగా మొన్నటి వరకు కేవలం 50 శాతం  ఆక్యుపెన్సీ తో థియేటర్ నడవడంతో ఎంతో మంది సినీ ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు సినీ ప్రేక్షకులు అందరికి శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: