"బుట్ట బొమ్మ" గురించి ఈ విషయాలు తెలుసా?

VAMSI
టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే చాలు అది పూజ హెగ్డే నేగా అని అందరికీ అర్థమైపోతుంది. అంతగా ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ సుందరి. "ఒక లైలా కోసం" సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ అందాల తార ఆ చిత్రంతో నాగ చైతన్యతో కలిసి స్టెప్పులు వేసి కుర్రకారుకు స్పీడు పెంచింది. మొదట్లో వరుస చిత్రాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత వరుస హిట్లతో దూకుడు పెంచి ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈమె గురించి అందరికీ బాగా తెలుసు. కానీ కొన్ని తెలియని ఇంట్రెస్టింగ్ అంశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ముంబై భామ పూజ హెగ్డే మొదట మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన వాటిలో పాల్గొంది కూడా, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టి అనంతరం సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

* ఈ బుట్టబొమ్మ మొదట కోలీవుడ్ లో తెరంగ్రేటం చేసింది. 'ముగామూడీ’ అనే తమిళ చిత్రంతో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.

*పూజకి క్రీడలు అంటే ప్రత్యేకమైన అభిమానం, టెన్నిస్ అంటే చాలా చాలా ఇష్టమట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ కి ఈమె వీరాభిమానట.

*దువ్వాడ జగన్నాధం చిత్రం తర్వాత పూజ హెగ్డే తన రెమ్యూనరేషన్ ను బాగా పెంచింది. ఆ సినిమా తరువాత ఆమె పారితోషకం అలా పెరిగిపోయిందట.

* కథకు చాలా అవసరమైతే తప్ప స్కిన్ షో చేయనని మొహమాటం లేకుండా ముందే చెప్పేస్తారట పూజ. అందుకు ఒప్పుకున్నాకే షూటింగ్ లో పాల్గొంటారట. ఇలా ముక్కుసూటిగా చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు.

* హిందీలో ఈమె తొలి చిత్రం "మొహంజదారో". ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్లు పాటు తన డేట్స్ ను ఇచ్చారట పూజ. అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

* ఈమెకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలంటే అస్సలు ఇంట్రస్ట్ లేదట...మరి సీరియస్ పాత్రల్లో నటించాలి అంటే తనకి నచ్చదట.

* కథ నచ్చితే కానీ సినిమాలు అస్సలు ఒప్పుకోరట పూజ. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామన్నా కన్విన్స్ అవరట. ఇలా కథ నచ్చక ఆమె రెండు మూడు బాలీవుడ్ ఆఫర్ లను కూడా వదులుకున్నట్లు సమాచారం.

ఈ రోజు పూజ హెగ్డే 31 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని తెలుగు ప్రేక్షకులను తన అందాలతో అలరించాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: