అందాల ముద్దు గుమ్మ
నందితా శ్వేత, నిఖిల్ హీరోగా
హెబ్బా పటేల్,
హీరోయిన్ గా తెరకెక్కిన
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం సినిమాలో కనిపించి మెప్పించిన
నందిత శ్వేతా ఆ తర్వాత అక్షర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది . ఇలా తెలుగు లో మంచి సినిమాల్లో నటిస్తూ తనకంటూ
హీరోయిన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం రారా.. నా
పెనిమిటి అనే సినిమాలో నటిస్తోంది.
విజయానంద్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.వెంకట సత్యప్రసాద్ దర్శకత్వంలో ఈ
సినిమా తెరకెక్కుతోంది. ఇలా
సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న
నందితా శ్వేత తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మీకు తెలుగు పరిశ్రమ నుండి ఏ విధమైన ఆదరణ లభిస్తుంది అని అడిగిన ప్రశ్నకు
నందిత శ్వేతా సమాధానం ఇస్తూ.. నా సినిమాల తో పాటు గత సినిమాలను కూడా పరిశీలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి చాలా బాగుంటుంది. కథ, కథనం తో పాటు చక్కని సందేశాత్మక, వినోదాత్మక సినిమాలను ఆదరిస్తారు అంటూ
నందితా శ్వేత చెప్పుకొచ్చింది.
అలాగే పెద్ద
హీరో లతో అవకాశాలు రావట్లేదా అని అడిగిన ప్రశ్నకు
నందితా శ్వేత సమాధానం ఇస్తూ.. ఇప్పడిపుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాను, అవకాశాలు వస్తే ఎందుకు చేయను.? అంటూ
నందిత శ్వేత సమాధానమిచ్చింది. ఇది ఇలా ఉంటే
నందితా శ్వేత రారా.. నా
పెనిమిటి సినిమా తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.