రాఘ‌వేంద్ర‌రావు చిరంజీవి, ఎన్టీఆర్‌ల‌తో ఎన్ని సినిమాలు చేశారో తెలుసా..!

VUYYURU SUBHASH
ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర రావు తెలుగు ద‌ర్శ‌కుడు అయినా ఆయ‌న అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టారు. ఇంకా చెప్పాలంటే అప్ప‌ట్లోనే ఆయ‌న బాలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టి తెలుగు సినిమా ఖ్యాతిని అప్ప‌ట్లోనే దేశ వ్యాప్తంగా చాటారు. అది రాఘ‌వేంద్ర రావు స్టైల్‌. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న రాఘ‌వేంద్ర రావు ఇటీవ‌ల సినిమాల వేగం త‌గ్గించేశారు. ఇప్ప‌టి త‌రానికి అనుగుణంగా ఆయ‌న సినిమాలు తీయ లేక‌పోతున్నాన‌న్న కార‌ణం తోనే ఆయ‌న ఇటీవ‌ల సినిమాలు త‌గ్గించేశారు.

ఇదిలా ఉంటే రాఘవేంద్ర రావు 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోగా పెళ్లి సంద‌డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేశారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు రోష‌న్ హీరోగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే పెళ్లిసంద‌D సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయ‌న మాట్లాడారు. అయితే ఈ సినిమాలో తాను ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డంపై కూడా ఆయ‌న మాట్లాడారు. ఇక త‌న‌కు కొత్త హీరోను ప‌రిచ‌యం చేయ‌డంలో ఎప్పుడూ అనందం ఉంటుంద‌ని చెప్పారు.

ఆయ‌న త‌న పేరును నిల‌బెట్టార‌ని అన్నారు. ఇక చిరంజీవిని తాను ఎప్పుడూ బాబాయ్ అని పిలుస్తూ ఉంటాన‌ని చెప్పింది. ఎన్టీఆర్ తో నేను 12 సినిమాలు చేస్తే చిరంజీవితో 14 సినిమాలు తీశాన‌ని...  వచ్చే యంగ్ స్టర్స్ కంటే కూడా ఆయన స్పీడ్ గా వెళుతూనే ఉంటాడ‌ని రాఘ‌వేంద్ర రావు మెచ్చుకున్నారు. ఇక త‌న అన్న‌య్య గురించి మాట్లాడుతూ ఆయ‌న భావోద్వేగానికి గుర‌య్యారు. త‌మ బ్యాన‌ర్ గురించి చెపుతూ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అంటే .. రాఘవేంద్రరావు - కృష్ణమోహన్ రావు అని మా బ్రదర్ పేరుతో పెట్టాన‌ని.. ఈ బ్యాన‌ర్ లో చిరంజీవి గారు .. వెంకటేశ్ గారు కూడా సినిమాలు చేశార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. త‌మ బ్యాన‌ర్ లో మొత్తం 12 సినిమాలు చేశామ‌ని ఆయ‌న చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: