వామ్మో.. మహేష్ బాబు అభిమానులు అక్కడ కూడా ఉన్నారా?
అంతేకాదు కుటుంబంతో విదేశాలకు వెళ్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి స్విజర్లాండ్ వెళ్ళాడు. ఇక అక్కడ పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే తన కుటుంబం తో ఎంజాయ్ చేస్తున్న ఒక ఫోటో ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కూతురు సితార కుమారుడు గౌతమ్ లతో స్విమ్మింగ్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలు షేర్ చేస్తూ దీనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చేసాడు మహేష్ బాబు. వీరిద్దరితో నీళ్లల్లో ప్రశాంతంగా గడిపేస్తున్నా అంటూ మహేష్ బాబు తెలిపాడు.
ఇటీవలే మహేష్ బాబు పోస్ట్ చేసిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ ఈ ఫోటో చూసి తెగ మురిసిపోతున్నారు. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు సైతం మహేష్ బాబు ఫోటో చూసి ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవలే మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో పై బంగ్లాదేశ్ నుండి ఒక అభిమాని కామెంట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది. నేను కూడా మహేష్ వీరాభిమాని.. మహేష్ బాబును ఎంతగానో అభిమానిస్తూ ఉంటాను అంటూ ఒక అభిమాని ఇక ఈ ఫోటోకి కామెంట్ పెట్టాడు. ఇది చూసిన తెలుగు అభిమానులు మా మహేష్ బాబుకి బంగ్లాదేశ్ లో కూడా అభిమానులు వున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.