తన ప్రియుడు గురించి రకుల్ పెట్టిన పోస్ట్ పై స్పందించిన మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అవ్వడం తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి, దానితో రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగునాట వరుస ఆఫర్లు తగ్గాయి. అందులో భాగంగా బ్రూస్ లీ, ధ్రువ, స్పైడర్, నాన్నకు ప్రేమతో వంటి పలు తెలుగు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. 
ఇలా తెలుగు నాట ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్ తో సహా బాలీవుడ్ లోను అనేక చిత్రాలలో నటించి అక్కడ కూడా  హీరోయిన్ గా మంచి స్థానాన్ని సంపాదించుకుంది.


 ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో తన ప్రేమ వ్యవహారం గురించి రకుల్ ప్రీత్ సింగ్ జనాలకు తెలియజేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ, తాను రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇలా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన పోస్ట్ కు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. అలా స్పందించిన వారిలో మంచు లక్ష్మి కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ మంచు లక్ష్మి ఎంత మంచి స్నేహితులో మన అందరికీ తెలిసిందే, వీరిద్దరూ ఎక్కడ కలిసిన ఎంత హల్చల్ చేస్తారో కూడా మనకు తెలిసిన విషయమే, అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలియజేయగా దానిపై స్పందించిన మంచు లక్ష్మి కంగ్రాట్స్.. ఇది ప్రేమను గట్టిగా, వైల్డ్‌గా సెలెబ్రేట్ చేసుకునే సమయం అంటూ ఫైర్ మీదున్నట్టుగా ఫైర్ ఎమోజీలను మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా పండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: