అఖండ బడ్జెట్ ఎంతో తెలుసా...?

murali krishna
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు  అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'అఖండ అని అందరికి తెలుసు ఈ సినిమా మే లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూట్ వాయిదా పడడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చిందని కూడా అందరికి తెలుసు.

మళ్ళీ తిరిగి షూట్ జరుపుతుండ గా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ మళ్ళీ వాయిదా వేశారని తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు ఇప్పటికి ఈ సినిమా షూట్ పూర్తి చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
రెండు రోజుల క్రితమే అఖండ సినిమాకు గుమ్మడి కాయ కొట్టి షూట్ ముగించినట్టు వార్త వినిపిస్తుంది.ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను దీపావళి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముగించే సరికి బడ్జెట్ సుమారు 95 కోట్లకు లెక్క వచ్చిందని సమాచారం.
అయితే ఈ వార్తలో నిజముంటే మాత్రం బాలయ్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ ఉన్న సినిమాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం ఇక్కడ వరకు బాగానే ఉన్న ఇక్కడే అందరికి అనుమానాలు వస్తున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య వరుస ప్లాపులతో ఉన్నాడని అందరికి తెలుసు. అందులోను కరోనా ఉన్న నేపథ్యంలో ఇంత బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుందా అనే సందేహం పలువురికి వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఈ సినిమా బడ్జెట్ వల్ల ఈ సినిమాపై అనుమానాలు తలెత్తుతున్నాయని సమాచారం. ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్ల పరంగా అంతగా రాబట్టలేక పోతున్నాయని అందరికి తెలుసు. మరి అఖండ సినిమాకు ఏకంగా 95 కోట్లు బడ్జెట్ పెట్టడం రిస్క్ అనే అంటున్నాయని సమాచారం. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తేనే అంత బడ్జెట్ రాబట్టడం కష్టమని తెలుస్తుంది.. అలాంటిది నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలు ఒడ్డున పడడం కూడా కష్టమని తెలుస్తుంది. ఇక అఖండ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని సమాచారం . ఒకటి అఘోరా పాత్ర అయితే మరొకటి కలెక్టర్ పాత్ర మరియు ఇంకొకటి ఫ్యాక్షనిస్ట్ అని టాక్ వినిపిస్తుందిఈ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారని అందరికి తెలిసిన  విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: