శ్రీను వైట్ల స్టార్ దర్శకుడు కావడానికి కారణం ఆ స్టార్ హీరోనట...!
శ్రీనువైట్ల సినిమాల్లోనూ ఓ సీన్ ప్రతిసారి రీపిట్ అవుతూ వుంటుందని తెలుస్తుంది. అదే 'తాగుబోతు'ల సీన్ అని అందరికి తెలుసు. అదే సినిమాకి అదే పెద్ద హైలెట్ గా నిలిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమాలను బాగా చూసే వారు ఈ విషయాన్ని పక్కగా గుర్తుపట్టేస్తారని తెలుస్తుంది. అయితే కామెడీని ఇంత బాగా తీసే శ్రీనువైట్ల తొలినాళ్లలో ప్రేమకథలతోనే ప్రేక్షకులను బాగా మెప్పించారట..
రవితేజతో తెరకెక్కించిన నీకోసం అనే లవ్ అండ్ యాక్షన్ మూవీ శ్రీనువైట్లను దర్శకుడిగా పరిచయం చేసింది.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైందని సమాచారం. కానీ ఈ సినిమా అగ్ర కథానాయకుడు అయిన నాగార్జునని మాత్రం బాగా ఆకట్టుకుందని తెలుస్తుంది. ఆ వెంటనే శ్రీనువైట్లని పిలిచి సినిమా చాలా బాగా తీశావని కానీ.. మధ్యలో కామెడీ ఉంటే ఇంకా చాలా బాగుండేదని తన అభిప్రాయం చెప్పుకొచ్చారని సమాచారం. భవిష్యత్లో తీసే సినిమాల్లో కామెడీని టచ్ చేయమని నాగార్జున మంచి సలహా ఇచ్చారని తెలుస్తుంది. అంత పెద్దాయన చెప్పేసరికి శ్రీనువైట్ల ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారని సమాచారం.
ఇక ఆకాశ్ మరియు రేఖతో తీసిన తన రెండో సినిమా ఆనందంలో కథతో పాటుగా కామెడీని కూడా మిక్స్ చేసి తెరాకెక్కించారట. ఈ ప్రయోగం బాగా విజయం సాధించడంతో కామెడీనే హీరోగా పెట్టి శ్రీను వైట్ల బ్లాక్ బస్టర్ విజయాలు పొందాడని సమాచారం.. ఆ వెంటనే వెంకీ, రెడీ మరియు ఢీ, దూకుడు, అందరివాడు అలాగే దుబాయ్ శ్రీను వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా మంచి స్థాయిలో స్థిరపడ్డారని సమాచారం..