చిరంజీవి కారణంగా ఎంత మంది నష్టపోయారో తెలుసా..??
అయితే చిరంజీవి రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టి ప్రజలకు న్యాయం చేకూర్చాలన్నారు. అంతేకాక.. తన వంతు ప్రయత్నం చేశాడు.. కానీ రాజకీయ పరంగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయారు. ఇక ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రజా రాజ్యం అనే పార్టీని స్తాపించినప్పుడు ఎలాగైనా సరే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని కొంతమంది బెట్ చేశారంట. అంతేకాదు.. చిరంజీవిని విమర్శించే విమర్శకులు మరికొంతమంది ఆయన ఓడిపోతాడని ఏకంగా 20 కోట్ల రూపాయలను బెట్ కట్టాడు. ఇక చివరికి చిరంజీవి ఓడిపోవడంతో ఆయన అభిమానులు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇక చిరంజీవి గెలుస్తారని ఎంతోమంది బెట్ లు వేసి..ఆర్థికంగా నష్టపోయారంట. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తనపై నమ్మకం పెట్టుకొని నష్టపోయిన వారికి ఆర్థికంగా సహాయం కూడా సహాయం చేసినట్లు సమాచారం. అంతేకాక.. అప్పుడే రాజకీయాల కోసం చిరంజీవి మంచి మంచి సినిమా ఆఫర్లను కూడా వదులుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. అయితే రాజకీయాల్లో ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో కేంద్ర మంత్రిగా పనిచేసి ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.
కాగా.. అప్పటి నుంచి చిరంజీవి వరుస సినిమాలతో తనదైన శాలిలో దూసుకెళ్తున్నాడు. అంతేకాక.. కొత్త కొత్త డైరెక్టర్ లకు కూడా అవకాశాలు ఇస్తూ, తనదైన శైలిలో కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు చిరు. అయితే చిరంజీవి రాజకీయాలవైపు చూడను అంటూ సినీ ఇండస్ట్రీలో ఉంటూనే ప్రజలకు తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు.