సమంత- చైతన్యకు క్లాస్ పీకిన వెంకటేష్?

praveen
గత కొన్ని రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఒక్కటే. అదే నాగచైతన్య సమంత విడాకుల విషయం. మొన్నటి వరకు వీరిద్దరు కూడా టాలీవుడ్ లోనే ఎంతో మందిని ఆకర్షించిన భార్యాభర్తలుగా ఉన్నారు. ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు.  అయితే గత కొన్ని రోజుల క్రితం నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకున్నానని మనస్పర్థలు వచ్చాయంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అయితే మొదట ఈ వార్తలు చూసిన వారందరూ ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని అనుకున్నారు.

 ఇటీవలే తాము విడాకులు తీసుకుంటున్నామని ఎవరి మార్గాల్లో వారు వెళ్లాలి అని అనుకుంటున్నామని జీవితాంతం స్నేహితులు కొనసాగాలి అని అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. దీంతో మొన్నటి వరకు ఎంతో క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య సమంత ఎందుకు విడిపోయారు అంటూ ప్రస్తుతం అందరూ అయోమయంలో పడిపోయారు. ఇక విడాకుల తర్వాత వీరు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగచైతన్య సమంత  విడాకులు తీసుకుంటున్నారు ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి అటు దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి గాని అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు.

 ఇకపోతే నాగచైతన్యను పెంచి పెద్ద చేసిన మేనమామ గా  ఉన్నా వెంకటేష్ ఇటీవలే పెట్టిన పోస్టు ప్రస్తుతం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవలే వెంకటేష్ పెట్టిన పోస్టు లో సమంత నాగ చైతన్య పేరును ప్రస్తావించక పోయినప్పటికీ ఇక ఆయన పెట్టిన పోస్టులు మాత్రం వారికి సంబంధించినదే అన్నది అందరికీ అర్థమవుతుంది.  ఏకంగా సమంత నాగచైతన్య కు విడాకులు తీసుకున్నందుకు క్లాస్ పీకినట్లుగానే వెంకటేష్ పోస్టు ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. మనసు అనేది ఆలోచనల పుట్ట.. మనం వెళ్లే మార్గాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదైనా విషయాన్ని పెదవి విప్పే ముందు  బుర్ర కూడా పెట్టాలి అంటూ రెండు పోస్టులు పెట్టారు వెంకటేష్. సాధారణంగా ఎప్పుడూ సినిమా అప్డేట్స్ పెట్టే వెంకటేష్ ఇలాంటి పోస్టులు పెట్టి సమంత నాగచైతన్య లకు క్లాస్ పీకాడు అంటూ అందరూ అనుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: