అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లాంటి భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ ఈ సంవత్సరం ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది, ఆ తర్వాత కొద్ది కాలానికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది, ఇలా రెండు వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న శృతి హాసన్, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్ మీకు నచ్చిన ప్రశ్న అడగండి, సమాధానం ఇస్తాను అని శృతిహాసన్ చెప్పడంతో, కొంత మంది స్పందించారు.
తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో శృతిహాసన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. మీ నాన్న కమల్ హాసన్ నుండి మీరు నేర్చుకున్న మూడు విషయాలు చెప్పమంటే, మూడు మాత్రమే అంటే చెప్పలేను అని చాలా ఉన్నాయి. నిర్భయంగా ఉండటం నేర్చుకున్నానని.. జీవితాన్ని ఉల్లాసంగా సాగాలంటే హాస్యం ముఖ్యమని కూడా తన తండ్రి నుంచే తెలుసుకున్నట్లు శృతిహాసన్ చెప్పింది. లక్ ను నమ్ముతారా? అంటే.. అంతకు మించిన కష్టపడటాన్ని నమ్ముతానని శృతిహాసన్ తెలియజేసింది. మ్యూజిక్ పరంగా ఏ దశాబ్దం బెస్ట్ అనుకుంటున్నారన్న ప్రశ్నకు 1970 ఉత్తమమైనదని తాను అనుకుంటానని శృతిహాసన్ తెలియజేసింది. నిజాయితీగా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని విషయాన్ని ఇన్నాళ్ల లో తాను నేర్చుకున్న పాఠం గా చెప్పిన శృతి హాసన్, అభిమానులు తెరపై చూపించే ప్రేమ, ఐస్ క్రీమ్, అమెరికన్ కామెడీ మూవీ, యాంకర్ మాన్ ఈ మూడు తనను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి సరిపోతాయి అంటూ శృతిహాసన్ తెలియజేసింది.