వర్మను మెప్పించిన పవర్ఫుల్ నటుడు.. ఆ హీరో?
ఎన్ని సినిమాల్లో నటించిన ప్రతి సినిమాలో కూడా తన వైవిధ్యమైన నటనతో పాత్రకు ప్రాణం పోసాడు రానా దగ్గుబాటి. పాత్రలో నట విశ్వరూపం చూపించడం అంటే ఎలా ఉంటుందో రానా నటన చూస్తే అర్థమవుతుంది ప్రతి ప్రేక్షకుడి అన్న రేంజ్ లో రానా పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. ఇలా రానా కీలక పాత్రలో నటించిన సినిమాలు ఎన్నో. అయితే ఇలాంటి సినిమాలో చెప్పుకోదగ్గ సినిమా ఏది ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నాయకుడు సినిమా. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించాడు దగ్గుబాటి రానా.
ఇక ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా లో కీలక పాత్ర అయినా చంద్రబాబు నాయుడు పాత్రలో ఒదిగిపోయి రానా నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. సాధారణంగా అందరు నటులపై కామెంట్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం వేగంగా రానా నటన చూసి ఫిదా అయిపోయారు అని చెప్పాలి. రానా పాత్రకు సంబంధించి మొదటి లుక్ విడుదల కాగానే దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు పాత్రలో రానా నటన చంపేసాడు అంటూ కామెంట్ చేసి అభినందించాడు. ఇలా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకులను విమర్శకులను సైతం మెప్పించాడు రానా.