సమంత నిర్ణయం వెనుక ఈ కారణమూ ఉందా?

VAMSI
గత ఒకటిన్నర నెలగా సమంత, నాగ చైతన్య లు విడాకుల వ్యవహారంపై వందలకొద్దీ కథనాలు వినిపించాయి. అక్కినేని అభిమానులు ఈ కథనాలన్నీ కట్టు కదలుగానే మిగిపోవాలని ...చైతు, సామ్ లు సంతోషంగా కలిసే ఉన్నారనే వార్త వినాలని వేయికళ్లతో ఎదురు చూశారు. కానీ వారి కలలన్ని కల్లలుగానే మిగిలిపోయాయి. అక్టోబర్ మూడు నా ఆ వార్తలన్నీ నిజమేనంటూ సమంత, నాగ చైతన్యలు తాము విడిపోతున్నది నిజమేనని అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. దాంతో తెలుగు ప్రేక్షకులకు దిగ్భ్రాంతికి గురయ్యి నిరాశ చెందారు. ఇక అప్పటి నుండి వీరు మళ్ళీ తిరిగి కలవాలని అందరూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

అలాగే  వీరు ఎందుకు విడిపోయారనే  అంశంపై అందరూ దృష్టి పెట్టారు. తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ విషయంపై మరో వార్త సంచలనంగా మారింది. గత సంవత్సరం నుండి వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని దానికి కారణం కోలీవుడ్ లో ఆమె మళ్ళీ బిజీ అవ్వాలనుకోడమే అని వార్తలు వినపడుతున్నాయి. వాటిలో ఒకటి ధనుష్ మూవీ అంటున్నారు. కొన్ని  తమిళ చిత్రాలకు సమంత ఒకే చెప్పారని వాటిలో ఆమె పాత్రలు మరీ గ్లామరస్ గా ఉండడంతో అలాంటి గ్లామరస్ పాత్రలకి ఇక  ఒప్పుకోవడం మానుకోవాలని చైతు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో ఇక అప్పటి నుండి సమంత, చైతుల మధ్య ఈ అంశం పై చిన్న చిన్న మాటలు జరగడం...అవి కాస్త వారి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమయ్యాయి అని చివరకు విషయం విడాకుల వరకు వచ్చిందని అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఏవని మాత్రం చైతు, సామ్ లు ఇప్పటికీ బయటకు చెప్పలేదు. అవి మా వ్యక్తిగత విషయాలు అర్దం చేసుకోండి అని తమ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: