30 ఏళ్ల తర్వాత.. చిరంజీవి సినిమాలో ఆ హీరో?
లో చాలామంది ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరం అవ్వగా.. మెగాస్టార్ మాత్రం ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తునే పోతున్నాడు.
అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తో నటించిన పలువురు హీరోలలో మురళీమోహన్ కూడా ఒకరు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో మురళీమోహన్ కూడా కొన్నాళ్లపాటు స్టార్ హీరో గానే కొనసాగాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి విజయాలు కూడా సాధించాడు. ఎన్నో సినిమాల్లో నటించిన మురళీమోహన్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అలరించాడు. ఆ తరువాత రాజకీయాలకు పరిమితమైన మురళీమోహన్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు.
అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన ఊరి పాండవులు, చిరంజీవి, త్రినేత్రుడు, గ్యాంగ్ లీడర్, యుద్ధభూమి అనే సినిమాల్లో మురళీమోహన్ కూడా నటించారు. ఇలా వీరిద్దరూ కలిసి నటించి దాదాపు 30 ఏళ్లు పూర్తయింది. ఇక ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మరో సారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ఫాదర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మురళీమోహన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది . దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఆత్రుతగా వున్నారు.