రాజమౌళి నాలుగు సినిమాలు.. ఒక్క టికెట్ పై?

praveen
ఇటీవలి కాలంలో ఈ టీవీలో ప్రసారమయ్యే చాలా కార్యక్రమాలు బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్  అందిస్తు న్నాయి.  అంతేకాదు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు  శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.  ఇక ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది.  ఈ షోకి జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్ యాంకరింగ్ అదరగొడుతున్నాడు .


 ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో జడ్జిగా ఇంద్రజ కొనసాగుతోంది. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని ఎల్లలు దాటించిన దర్శకుడు..  తెలుగు వారి గౌరవాన్ని మరింత పెంచిన వ్యక్తి..  ప్రతి సినిమాని కూడా శిల్పంలా చెక్కి.. రికార్డులు కొల్లగొట్టే ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తెరకెక్కించిన నాలుగు సినిమాలను ఒకే పర్ఫామెన్స్ లో చూపించారు.



 ఒక్క టికెట్ పై నాలుగు సూపర్ హిట్ సినిమాలు చూడాలని ఉందా..  అయితే రాజమౌళి తెరకెక్కించిన నాలుగు సినిమాలు చూపించేందుకు రాంప్రసాద్ వచ్చేస్తున్నాడు అంటూ సుదీర్  చెప్పగానే పర్ఫామెన్స్ స్టార్ట్ అవుతుంది.  ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర.. రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు.. సునీల్ హీరోగా తెరకెక్కిన  మర్యాద రామన్న..  నాని హీరోగా తెరకెక్కిన ఈగా సినిమాలను ఒకటే పర్ఫామెన్స్ లో చూపించారు. ప్రోమోలో భాగంగా ఈ పర్ఫామెన్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత మగధీర సీన్ రిపీట్ చేయడానికి హైపర్ ఆది వెళ్లి ఇంద్రజ చేయి పట్టుకుంటాడు.. ఇక అంత లోనే ముత్యాల చెమ్మచెక్క అనే సాంగ్ రావడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Adc

సంబంధిత వార్తలు: